Chandrayaan-2 Discovery Ice on Moon South Pole:ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ అనగానే చాలామందికి ల్యాండర్ వైఫల్యం గుర్తుకు రావచ్చు. కానీ, ఆ మిషన్‌లో భాగమైన ఆర్బిటర్ గత కొన్నేళ్లుగా చంద్రుడి చుట్టూ తిరుగుతూ మన ఊహకందని రహస్యాలను ఛేదిస్తోంది. తాజాగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉపరితలం కింద వాటర్ ఐస్ ఉందని ఈ ఆర్బిటర్‌ పంపిన డేటా ద్వారా శాస్త్రవేత్తలు నిర్దారించారు. 

Continues below advertisement

ఆర్బిటర్ అద్భుత అన్వేషణ 

చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని గతంలోనే తెలుసు, కానీ ఇప్పుడు సర్ఫేస్‌ ఐస్ వెలుగులోకి వచ్చింది. అంటే చంద్రుడి ఉపరితలంపై  కాకుండా కింది పొరల్లో ఈ మంచు దాగి ఉంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. ముఖ్యంగా డబ్లీ షాడోడ‌ క్రేటర్స్ అని పిలిచే ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి. ఇవి ఎంత చీకటిగా ఉంటాయంటే, కొన్ని బిలియన్ ఏళ్లుగా అక్కడ సూర్యకాంతి అనేది పడలేదు. 

చంద్రుడి దక్షిణ ధ్రువం సౌర కుటుంబంలోనే అత్యంత రహస్యమైన, శీతల ప్రాంతం, ఇక్కడ ఫౌస్టిని అనే పెద్ద గుంత లోపల ఉన్న సుమారు 1.1 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఒక చిన్న గుంతలో అత్యధిక స్థాయిలో మంచు ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సుమాుర మైనస్‌ 248 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి. ఇంతటి విపరీతమైన చలి వల్ల అక్కడ నీరు బిలియన్ల ఏళ్లుగా మంచు గడ్డలుగా  స్థిరంగా ఉంది. 

Continues below advertisement

ఎలా గుర్తించారంటే...?

ఈ అన్వేషణలో చంద్రయాన్ -2 ఆర్బిటర్ మోసుకెళ్లిన DFSAR అనే పరికరం కీలక పాత్ర పోషించింది. ఎల్‌ బ్యాండ్, ఎస్ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి మైక్రోవేవ్‌ ఇమేజింగ్‌తో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేశారు. రాళ్లు, మంచును వేరు చేయడానికి శాస్త్రవేత్తలు  సీపీఆర్ , డీఓపీను ఉపయోగించారు. సీపీఆర్ విలువ కంటే 1  కంటే ఎక్కువగా, డీఓపీ విలువ కంటే 0.13 కంట తక్కువగా ఉన్న ప్రాంతాలను మంచు ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. శాస్త్రవేత్తలు అక్కడ లోబేట్ రిమ్‌ ఫీచర్లను కూడా గమనించారు. ఇవి సాధారణంగా ఏదైనా గ్రహ శకలం భూగర్భంలోని మంచు పొరను ఢీ కొట్టినప్పుడు ఏర్పడే ప్రవాహ గుర్తులుగా భావిస్తారు.          

ఇదో పెట్రోల్ బంకులాంటిది! 

చంద్రుడిపై నీరు దొరకడం అనేది కేవలం దాహం తీర్చుకోవడానికే కాదు, భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు అది ఒక పెట్రోల్ బంక్‌ లాంటిది. భవిష్యత్‌్లో చంద్రుడిపై స్థిరపడే వ్యోమగాములు ఇది ఉపయోగపడుతుంది. ఈ నీటిని విడగొట్టడం ద్వారా శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రాణవాయువును తయారు చేయవచ్చు. నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ను విడదీసి రాకెట్ ఇంధనంగా వాడవచ్చు. దీని వల్ల భూమి నుంచి భారీ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం తగ్గుంది.           

చంద్రయాన్-3 విజయం మనకు చంద్రుడిపై అడుగుపెట్టే సామర్థ్యాన్ని నిరూపిస్తే, చంద్రయాన్-2 ఆర్బిటర్‌ మనకు అక్కడ ఎక్కడ వనరులు ఉన్నాయో దారి చూపిస్తోంది. ల్యాండర్ విఫలమైనప్పటికీ, ఆర్బిటర్ ఇప్పటికీ అద్భుతమైన డేటాని అందిస్తోంది.