Covid Guidlines: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రబుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా చికిత్సలో యాంటీ బయాటిక్ ఔషధాలు ఉపయోగించకూడదని దేశంలోనే వైద్యులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. పేషెంట్ లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తలెత్తినట్లు అనుమానాలు వస్తేనే యాంటీ బయాటిక్స్ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు వయోజనులకు కరోనా చికిత్సకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ మార్గద్శకాలు వచ్చాయి. మార్గదర్శకాల సవరణ కోసం ఎయిమ్స్, ఐసీఎంఆర్ కొవవిడ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ జనవరి 5వ తేదీన భేటీ అయింది. లూపినవిర్, రిటోనవిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్ మెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరవిర్, అజిథఅరోమైసిన్, డాక్సీసైక్లిన్ ఔషధాలను కొవిడ్ రోగులకు ఇవ్వొద్దని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.


ప్లాస్మా థెరపీని కూడా చేయొద్దని వివరించింది. రోగులకు కరోనాతో పాటు ఇతర అంటు వ్యాధులు ఏమైనా సోకుతున్నాయా అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలని వైద్యులకు తెలిపింది. రోగికి వ్యాధి తీవ్రంగా లేదా మధ్యస్తంగా ఉండి.. వేగంగా వృద్ధి చెందుతున్నట్లయితే టోసిలిజుమాబ్ ఔషధాన్ని ఇవ్వడాన్ని పరిశీలించాలి. రోగి తీవ్రంగా ప్రభావితమైనా, ఐసీయూలో అడ్మిట్ అయినా 24 నుంచి 28 గంటల్లోగా ఈ ఔషధాన్ని ఇవ్వాలని కేంద్రం వివరించింది.


దేశంలో కొత్తగా 918 కరోనా కేసులు


దేశంలో కొత్తగా 918 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేల 350 కు చేరింది. కేంద్ర వైద్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మరో నాలుగు కరోనా మరణాలు సంభవించాయి. రాజస్థాన్ లో రెండు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయిట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంర్య 5 లక్షల 30 వేల 80కు చేరింది. ఆదివారం ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు రావడం 129 రోజుల తర్వాత ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో పాజిటివిటీ రేటు 2.08 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.86 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతమేనని ఆరోగ్య శాఖ వెబ్ సైట్ తెలిపింది. ఆదివారం 44వేల 225 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. 


మన దేశంపై ఇన్ఫ్లూయేంజా దాడి చేసింది. ఇప్పటికే ఎంతోమంది ఈ ఫ్లూ బారిన పడుతున్నారు, వైరల్ ఫీవర్లు, జ్వరం, జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల మరణాలూ సంభవిస్తున్నాయి. ఈ ఫ్లూ చాలామంది తేలికగా తీసుకుంటున్నారు.  ప్రభుత్వం జారీ చేసిన సలహా ప్రకారం ఈ ఫ్లూ... పిల్లలు, వృద్దులపైనే ప్రతాపం చూపిస్తోంది. కాబట్టి కోవిడ్ మాదిరిగానే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ వైరస్ కళ్ళు, ముక్కు, నోటి ద్వారా వ్యాపిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈ ఫ్లూ నుంచి బయటపడవచ్చు.
ఇందుకోసం ఐదు సూపర్ ఫుడ్‌లను మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 


దాల్చిన చెక్క 
మెంతులు 
అల్లం 
పసుపు 
లవంగాలు