Jack Dorsey Interview: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మోడీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ఉద్యమ సమయంలో విమర్శలు చేసిన వారి ఖాతాలను సస్పెండ్ చేయాలని భారత ప్రభుత్వం ట్విటర్‌పై ఒత్తిడి తెచ్చిందని ఆయన ప్రధాన ఆరోపణదీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేశాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై మోడీ ప్రభుత్వంలోని మంత్రి స్పందించారు. జాక్ డోర్సీ చేసిన ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ట్విట్టర్ ప్రతిసారీ భారత చట్టాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 


జాక్ డోర్సీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'జాక్ డోర్సీ అబద్ధాలను చెప్పారు. బహుశా ట్విట్టర్ చరిత్రలో అత్యంత అనుమానాస్పదమైన అంశాన్ని చెరిపేసే ప్రయత్నం కావచ్చు. డోర్సీ , అతని బృందం పదేపదే భారత చట్టాలను ఉల్లంఘించారు. వాస్తవానికి, ట్విట్టర్ 2020 నుంచి 2022 వరకు భారతీయ చట్టాలను పట్టించుకోలేదు. జూన్ 2022లో సమ్మతించారు. ఈ సమయంలో ఏ ట్విటర్ అధికారి జైలుకు వెళ్లలేదు, ట్విటర్‌ బ్యాన్ కాలేదు. డోర్సీ కాలంలో భారత చట్టాలను అంగీకరించడానికి ట్విటర్ ఇబ్బంది పడింది. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 






జాక్ డోర్సీ ఏం చెప్పారంటే..
బ్రేకింగ్ పాయింట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ డోర్సీని ట్విట్టర్‌లో ఉన్నప్పుడు ఏ దేశ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా అని అడిగారు. దీనిపై డోర్సే స్పందిస్తూ, రైతుల నిరసన సమయంలో, ప్రభుత్వాన్ని విమర్శించే అనేక ట్విట్టర్ హ్యాండిల్స్‌ను నిషేధించాలని తనను కోరారని చెప్పారు. అలా చేయని పక్షంలో అధికారుల ఇళ్లపై దాడులు చేసి భారత్‌లో ట్విటర్‌ను మూసివేస్తామని హెచ్చరించారు. భారత్‌తోపాటు టర్కీ ప్రభుత్వాన్ని కూడా ప్రస్తావించిన డోర్సీ అక్కడి ప్రభుత్వం కూడా ట్విటర్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తోందని, బెదిరించిందని అన్నారు.


ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడి ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ మరింత వైరల్ అవుతోంది. అన్ని ప్రతిపక్ష నేతలు దాన్ని షేర్ చేస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 


Also Read: పరుగులు పెడుతున్న పారిశ్రామిక రంగం, భారీగా పెరిగిన ఉత్పత్తి