ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎకో సిస్టం దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు కాంపిటీషన్ కమిషన్ గూగుల్‌పై రూ.1,337.76 కోట్ల జరిమానా విధించింది. అన్యాయమైన వ్యాపార పద్ధతులను నిలిపివేయాలని ఆదేశించింది. నిర్దేశించిన కాలపరిమితిలోపు తన ప్రవర్తనను సవరించాలని గూగుల్‌ని కూడా ఆదేశించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించే వినియోగదారులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో 2019 ఏప్రిల్‌లో ఈ విషయంలో వివరణాత్మక విచారణకు ఆదేశించింది. ఆండ్రాయిడ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్ల ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMs) ఇన్‌స్టాల్ చేసిన ఓపెన్ సోర్స్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్.
విడుదల చేసిన ప్రకటన ప్రకారం మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (MADA) కింద మొత్తం Google Mobile Suite (GMS)ని తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి అని, దానిని అన్-ఇన్‌స్టాల్ చేసే అవకాశం లేకుండా ఉండటం పోటీ చట్టాలకు విరుద్ధంగా ఉందని CCI తెలిపింది.
"ఈ బాధ్యతలు OEMలపై Google విధించిన సప్లిమెంటరీ ఆబ్లిగేషన్స్‌లో కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. ఇది చట్టంలోని సెక్షన్ 4(2)(d)కి విరుద్ధంగా ఉంది" అని ప్రకటనలో పేర్కొన్నారు. పోటీ చట్టంలోని సెక్షన్ 4 ఆధిపత్య స్థానం దుర్వినియోగానికి సంబంధించినది.
ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని శాశ్వతం చేసింది. దీని ఫలితంగా పోటీ సెర్చింజన్‌లకు మార్కెట్ యాక్సెస్ లభించడం లేదు. అలాగే పోటీ చట్టాన్ని ఉల్లంఘించే ఆన్‌లైన్ జనరల్ సెర్చ్‌లో దాని స్థానాన్ని రక్షించుకోవడానికి, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కోసం యాప్ స్టోర్ మార్కెట్‌లో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసింది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?