Pakistan Gold Discovery in Indus River:సింధు నదిలో దొరికే బంగారు నిక్షేపాలపై భారత్‌కు హక్కు ఉందా?
Gold Discovery in Indus River: పాకిస్తాన్‌లో ప్రవహిస్తున్న సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు కనుగొన్నారు. ఇది ఆ దేశ స్థితిగతులను మార్చేయనుంది. ఈ పసిడిపై భారత్‌కు హక్కు ఉందా? ఉంటే ఏం చేయాలి?

Pakistan Gold Discovery in Indus River: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న నౌషెరా చాలా వెనకుబడిన ప్రాంతం. ఇక్కడ నిర్వహించి పరిశోధనల్లో బంగారు నిక్షేపాలు వెలుగు చూశాయి. దీంతో ఆ ప్రాంతం ఇప్పుడు బంగారు కొండగా మారిపోయింది. సింధు నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో భారీగా బంగారం తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ఈ ప్రాంత ఆర్థిక స్థితిని మార్చివేసింది. కుండ్ నుంచి నిజాంపూర్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో తవ్వకం కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. సింధు నదిలో బంగారు నిక్షేపాల ఆవిష్కరణ నౌషెరాను మైనింగ్‌కు ముఖ్యమైన కేంద్రంగా మార్చింది.
పాకిస్తాన్‌లోని ప్రముఖ వార్తాపత్రిక డాన్ నివేదిక ప్రకారం, సింధు నదిలో మైనింగ్ పనులు రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి. తవ్వకాలు చేసేవారు నది లోపల మట్టిని వెలికితీసి బంగారు రేణువులు వెతికి పట్టుకుంటున్నారు. ఈ మైనింగ్‌తో ఆ ప్రాంతంలో పనిచేసే కార్మికులకు కూడా మెరుగైన వేతనాలు లభిస్తున్నాయి. ఒక కార్మికుడికి రోజుకు రూ. 1000 నుంచి 1500 వరకు జీతం ఇస్తున్నారు. దీని కారణంగా స్థానిక కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
బంగారు గని వల్ల ఆర్థిక పరిస్థితి మారిపోయింది.
నౌషేరాలోని సింధు, కాబూల్ నదుల సంగమం వద్ద ప్లేసర్ బంగారు తవ్వకం ఈ ప్రాంత ఆర్థికస్థితిలో మార్పు తీసుకొచ్చింది. గతంలో అక్కడ మైనింగ్ చిన్న స్థాయిలోనే జరిగేది, కానీ గత కొన్ని నెలలుగా ఈ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నది అడుగున ఉన్న బంగారాన్ని వెలికి తీసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రాత్రింబవళ్లు పాల్గొంటున్నారు.
Also Read: 8వ వేతన సంఘం ఫార్ములాతో మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?
అటాక్ సమీపంలో రూ. 800 బిలియన్ల విలువైన బంగారు నిల్వలు ఉన్నాయన్న వాదనలతో ఈ ప్రాంతం ప్రజల దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే (GSP) నివేదిక ఆధారంగా పంజాబ్ మాజీ గనులు, ఖనిజాల మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ సోషల్ మీడియాలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ప్రజలు అక్కడకు భారీగా తరలి వస్తున్నారు. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారాన్ని వెలికితీసేందుకు చేస్తున్న తొందరపాటు చర్యలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. తవ్వకాలతో సింధు నది పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని వాదిస్తున్నారు. నది గర్భంలో తవ్వకాలతో చేపల సంఖ్య తగ్గుతుందని, దీని ప్రభావం జలచరాలపై కనిపిస్తోందని వారిస్తున్నారు. ఇక్కడ బంగారం తవ్వకాల కోసం వాడే పాదరసం వల్ల నదీ జలాల నాణ్యత దెబ్బతింటాయని అంటున్నారు. ఇది పర్యావరణ సమతుల్యతకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సింధు నదిలో దొరికే బంగారు నిక్షేపాలను భారత్ క్లైమ్ చేయగలదా?
సింధు నది పరివాహక ప్రాంతాల్లో బంగారం భారీ స్థాయిలో దొరకడానికి హిమాలయాలే కారణమని అంటున్నారు పరిశోధకులు. అందుకే సింధు నదిలో బంగారం దొరకడానికి భారత్ పరోక్ష కారణంగా చెబుతున్నారు. అందుకే భారత దేశం నుంచి ప్రవహించే సింధు నధి పాకిస్తాన్‌కు వరంలా మారింది. పాకిస్తాన్ రూపాయల ప్రకారం వందల బిలియన్ల్ పసిడి నిక్షేపాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఆ నది భారత్ గుండా ప్రవహిస్తున్నందున దాన్ని భారత్ క్లైమ్ చేసుకోవచ్చు కదా అనే అనుమానం చాలా మందికి ఉంటోంది. కానీ సింధు నదిలో దొరికే నిక్షేపాలు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. అందుకే వాటిని క్లైమ్ చేయడం భారత్‌కు వీలుపడదు. భారత్‌లోని హిమాలయ పర్వతాలు ద్వారానే ఈ బంగారం సింధు నదిలోకి వచ్చినప్పటికీ అది వీలుపడదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌కు ఎలాంటి హక్కు ఉండదు. మొత్తం పాకిస్తాన్‌కే చెందుంతుంది. భారత్ మాత్రం ఎలాంటి క్లైమ్ చేసుకోలేదు.
Also Read: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్