Salary Hike With the 8th Pay Commission Formula: భారత ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. 8వ వేతన సంఘం సిఫార్సుల కారణంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు మొత్తం కలిపి దాదాపు 1.15 కోట్ల మంది జీతాలు & పింఛన్లు పెరగవచ్చు. ఈ కమిషన్‌ సిఫార్సుల్లో జీతాల పెంపునకు ప్రధాన ఆధారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ ‍‌(8th Pay Commission Fitment Factor). ఇది ఉద్యోగుల జీతం పెంచడంలో అతి ప్రధాన గుణకంలా పని చేస్తుంది.


8వ వేతన సంఘం ఫార్ములాతో జీతం ఎంత పెరుగుతుంది?
వాస్తవానికి, ఏ వేతనం సంఘంలో అయినా జీతం & పెన్షన్‌ను పెంచడంలో అతి ముఖ్యమైన అంశం 'ఫిట్‌మెంట్'. దీని ఆధారంగా ఉద్యోగుల ప్రస్తుత ప్రాథమిక జీతాన్ని  (Basic pay) గుణిస్తారు. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 2.57గా ఉంది, దీనివల్ల ఆ సమయంలో ఉద్యోగుల జీతం సగటున 23.55 శాతం పెరిగింది. ఇప్పుడు, జాతీయ మీడియా నివేదికల ప్రకారం, 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.28 నుంచి 2.86 మధ్య ఉంచవచ్చు. ఈ కారణంగా ఉద్యోగులు 20 శాతం నుంచి 50 శాతం వరకు జీతం పెంపును ఆశించవచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనం రూ. 18,000 & ఫిట్‌మెంట్ కారకం 2.86 అయితే, కొత్త ప్రాథమిక వేతనం రూ. 51,480 ‍‌(18,000 x 2.86) అవుతుంది.


లెవెల్‌ 01 నుంచి  లెవెల్‌ 10 వరకు భారీ లబ్ధి
ప్రస్తుతం, లెవెల్‌ 1 ఉద్యోగుల కనీస జీతం రూ. 18,000గా ఉంది. ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 2.86 అయితే, మూల వేతనం రూ. 51,480కు పెరుగుతుంది. అదే తరహాలో,  లెవెల్‌ 10 అధికారుల ప్రస్తుత కనీస ప్రాథమిక వేతనం రూ. 56,100 గా ఉంది. ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 2.86 అయిన పక్షంలో, ఈ స్థాయి ఉద్యోగుల కొత్త కనీస బేసిక్‌ పే రూ. 1,60,446 గా మారుతుంది. 'బేసిక్‌ పే'తో పాటు ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యం ‍‌(Transport Allowance), విద్య & వైద్యం అలవెన్సులు వంటివి కూడా పెరగవచ్చు. ప్రాథమిక జీతానికి వీటిని కూడా కలిపితే స్థూల జీతం ‍‌(Gross Salary)లో భారీ పెరుగుదల కనిపిస్తుంది.+


మరో ఆసక్తికర కథనం: డొనాల్డ్‌ ట్రంప్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ మనమే, ఏప్రిల్‌ 02 నుంచి వార్‌ - ఈ రంగాలపై ఎక్కువ ఎఫెక్ట్‌ 


8వ వేతన సంఘం ఎందుకు అవసరం?
8వ వేతన సంఘం ఏర్పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది జీతం & పింఛనుతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఎయిత్‌ పే కమిషన్ దేశంలోని ద్రవ్యోల్బణం (Inflation), ధరలు (Prices) & ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగుల జీతపు నిర్మాణంలో అవసరమైన సర్దుబాట్లు చేస్తుంది. తద్వారా ఉద్యోగులు వారి పనికి & ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా సరైన విలువ/ పరిహారం పొందే వీలవుతుంది.


మరో ఆసక్తికర కథనం: రూ.6000 పెరిగి పసిడి రేటు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ