పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ బడ్జెట్ గురించి మాట్లాడారు. అస్థిర ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య, భారతదేశ బడ్జెట్ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిర్మలా సీతారామన్ అన్ని ప్రయత్నాలు చేస్తారని తాను బలంగా నమ్ముతున్నానని మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రపంచం మొత్తం చూస్తోందని చెప్పారు. 


ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని మోదీ అన్నారు. ఆదివాసీలకు, మహిళలకు ఇచ్చే గౌరవం అని, మన దేశ ఆర్థిక మంత్రి కూడా మహిళే అని పార్లమెంటులో ప్రధాని అన్నారు. రేపు (ఫిబ్రవరి 1) ఆమె మరో బడ్జెట్ ను దేశం ముందు ప్రవేశపెట్టనున్నారని అన్నారు. ‘‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో, భారతదేశం మాత్రమే కాదు, యావత్ ప్రపంచం భారతదేశ బడ్జెట్ పై కన్నేసింది. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్ ను ముందుకు తీసుకువెళతాం. అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ అన్నారు.