అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్‌లో ఓ విమానం క్రాష్ అయింది.   అహ్మదాబాద్‌ నుంచి లండన్ వెళుతున్న AIRINDIA Boeing 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే నివాస సముదాయాలపై ఎయిరిండియా ఫ్లైట్ కూలిపోయినట్లు తెలుస్తోంది. దాంతో ఆ మార్గలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తూ అన్ని రోడ్లను మూసివేశారు.

ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సి ఉంది. మేఘాని నగర్‌లో టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 242మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఫ్లైట్ లండన్ వెళ్లాల్సి ఉండటంతో ఇంధనం కూడా చాలా ఎక్కుువుగా ఉంది. టేకాఫ్ సమయంలో దగ్గరలోని చెట్టును ఢీకొన్నట్లుగా అనుమానిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఇంకా తెలీదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం దట్టమైన పొగలు కమ్మేసుకున్నాయి. సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.