Tamilisai to contest from Chennai South: న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి 400కి పైగా సీట్లు సాధించాలని ప్లాన్ చేస్తోంది. ఇదివరకే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ అధిష్టానం గురువారం నాడు 9 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్.. లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. తమిళిసై చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. గవర్నవర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం తమిళిసై మరోసారి బీజేపీలో చేరారు. దాంతో ఆమె మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే బీజేపీ తమిళిసైపై నమ్మకం ఉంచి చెన్నై సౌత్ నుంచి ఆమెకు సీటు ఖరారు చేసింది.


నియోజకవర్గం - అభ్యర్థి పేరు
1. చెన్నై సౌత్ - డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
2. చెన్నై సెంట్రల్ - వినోజ్ పి. సెల్వం
3. వెల్లూరు  - డాక్టర్ A. C. షణ్ముగం
4. కృష్ణగిరి  - సి.నరసింహన్
5. నీలగిరి (SC) - డాక్టర్ ఎల్. మురుగన్ 
6. కోయంబత్తూరు - కె. అన్నామలై
7. పెరంబలూరు - T. R. పరివేందర్
8. తూత్తుక్కుడి - నైనార్ నాగేంద్రన్
9. కన్యాకుమారి - పొన్. రాధాకృష్ణన్






బీజేపీ తొలి జాబితాలో 195 అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో 72 మందికి ఛాన్స్ ఇచ్చింది. గురువారం (మార్చి 22న) తాజాగా ప్రకటించిన 3వ జాబితాలో కేవలం 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అది కూడా కేవలం తమిళనాడులో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఓవరాల్‌గా 3 జాబితాలలో కలిపి బీజేపీ 276 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది.