Indian Railways Update: ప్రయాణికులకు శుభవార్త- AC రైళ్లలో 50 శాతం టికెట్ ధరల తగ్గింపు!

Indian Railways Update: ఎండలు విపరీతంగా పెరుగుతోన్న వేళ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ టికెట్ ధరలపై డిస్కౌంట్ ప్రకటించింది.

Continues below advertisement

Indian Railways Update: రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి లోకల్ ఏసీ రైళ్లలో ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ ధరలపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే ఇక ముంబయి లోక‌ల్ ఏసీ రైళ్ల‌లో స‌గం ధ‌ర‌కే ప్ర‌యాణాలు చేయొచ్చు. 

Continues below advertisement

పెట్రో భారంతో

దేశంలో పెట్రో ధరలు భారీగా పెరగడంతో రోడ్డు ప్రయాణాలు చేయాలంటేనే జనం భయపడుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ పరిస్ధితి కూడా అలానే ఉంది. బస్సు టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

ముంబయిలో లోక‌ల్ రైళ్లు ప్ర‌జా ర‌వాణాలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ముంబయిలో జ‌నం దాదాపు ఈ లోక‌ల్ రైళ్ల ద్వారానే త‌మ రాక‌పోక‌ల‌ను సాగిస్తుంటారు. అయితే ఎండలు మండిపోవడంతో రైలు ప్రయాణాలు కూడా కష్టంగానే ఉన్నాయి. దీంతో ఏసీ లోకల్ రైళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

హర్షం

ఏసీ రైళ్ల‌లో టిక్కెట్ ధ‌ర 50 శాతం త‌గ్గించ‌డాన్ని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్వాగతించారు. కొన్ని రోజులుగా ఈ డిమాండ్ ఉంద‌ని, ఇప్పుడు త‌గ్గించడం సంతోషకరమన్నారు.

Also Read: Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మళ్లీ నిరాశే

Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!

Continues below advertisement