Govt may ban sale of loose cigarettes: స్మోకింగ్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే షాకివ్వనుంది. ధూమపానం చేసేవారు ఇకనుంచి ఒక్కొక్క సిగరెట్ కొనే అవకాశం ఉండదు. విడిగా సిగరెట్లు అమ్మకంపై నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. భారత ప్రభుత్వం 2023- 24 బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే పొగాకు ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించడానికి విడిగా సిగరెట్లు అమ్మకం, విమానాశ్రయాల్లో స్మోకింగ్ జోన్లపై నిషేధం విధించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.
2023 ఫిబ్రవరి 1 వ తేదిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందే స్మోకర్లకు కేంద్రం షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఏటా 3.5 లక్షల మంది ధూమపానం కారణంగా చనిపోతున్నారు. పొగాకు వాడకం నియంత్రించేందుకు విడిగా సిగరెట్ల విక్రయాలు జరగకుండా నిషేధం విధించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి తమ ప్రతిపాదనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పొగుకు ఉత్పత్తులైన సిగరెట్లపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీ, 290 శాతం వరకు ఎక్సైజ్ సుంకం విధించింది. అయినా ధూమపానం చేసే వారిపై అంతగా ప్రభావం చూపలేదని, ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఓవరాల్ గా సిగరెట్లపై 64 శాతం పన్ను విధిస్తున్నా, విక్రయాలు, వాడకంలో తగ్గుదల కనిపించలేదు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) కూడా సిగరెట్లపై పన్నును 75 శాతానికి పెంచమని కోరాగా ,కేవలం పన్నులు పెంచడం మాత్రమే సరిపోదని స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారుసు మేరకు ఈ-సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని 2019లో నిషేధించారు.
దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్‌లలో స్మోకింగ్ జోన్లపై నిషేధం విధించాలని ఆ కమిటీ కేంద్రానికి సూచించింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ, వీఎస్‌టీ ఇండస్ట్రీస్ నుంచి వినియోగదారులు ప్యాకెట్ల సిగరెట్స్‌ను కొనుగోలు చేయవలసి వస్తుంది. దీంతో పొగాకు పరిశ్రమకు ఇది అనుకూల ఫలితాలు ఇస్తుందని కొందరు వ్యాపార విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు (సోమవారం) నాడు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు యాభైరెండేళ్ళ గరిష్టానికి చేరుకున్నాయి. 2.87 శాతం పెరిగి డిసెంబర్ 12న రూ.2,009.00 వద్ద ముగిసింది. వీఎస్టీ, ఐటీసీ స్టాక్స్ వరుసగా 1.6 శాతం,0.54 శాతం లాభపడ్డాయి.
గ్లోబల్ అడల్డ్ టొబాకో సర్వే ఇండియా ప్రకారం మన దేశంలో 267 మిలియన్ల మంది పెద్దలు పొగాకును వినియోగిస్తున్నారు. అనేక పరిశోధనల తరువాత ధూమపానం కంటి చూపును దెబ్బతీస్తుందని బయటపడింది. మాక్యులా క్షీణతకు కారణమవుతుందని తేలింది. మాక్యులా అంటే రెటీనాకు వెనుక భాగంలో ఉండే చిన్న భాగం. ఇది రంగులను గుర్తించేందుకు, ఎదురుగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించేందుకు, కేంద్ర దృష్టికి అవసరం. మాక్యులా ఫోటోరిసెప్టర్ కణాలను కలిగి ఉంటుంది. ఇవి కాంతిని గుర్తించే కణాలు.మాక్యుమా దెబ్బతింటే చూపు మధ్య భాగంలో మచ్చలా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలు కనిపించినా మధ్య భాగంలో ఏమీ కనిపించకుండా ఇలా నల్ల చుక్కలా కనిపిస్తుంది. ధూమపానం కళ్లకు చికాకును కలిగిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ కు దారి తీస్తుంది. ధూమపానం అధికంగా చేయడం వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ మాక్యుమా దెబ్బతినడం, కంటి శుక్లాలు, గ్లాకోమా వంటివి కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు కంటి వైద్య నిపుణులు.