Ram Temple Consecration Ceremony: మైసూర్‌కు చెందిన శిల్పి చెక్కిన రామ్‌ లల్లా విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టంచనున్నారు. ఈ మేరకు టెంపుల్ ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ ప్రకటించారు. అరుణ్‌ యోగిరాజు చెక్కిన రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టంచబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎంపికైన మూడు విగ్రహాల్లో అరుణ్ యోగిరాజు చెక్కింది అత్యద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. 


కొత్త విగ్రహం 150 నుంచి 200 కిలోల బరువుతో సిద్ధం చేసినట్టు రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల బాలుడిగా ఉన్నట్టు రామ్‌లల్లా విగ్రహం ఉంటుందని అన్నారు. గత 70 ఏళ్లుగా పూజులు అందుకుంటున్న విగ్రహం కూడా దేవాలయంలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేటితో ప్రారంభం కానుంది. జనవరి 22న ముఖ్య ఘట్టం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఏడు వేలమందిని టెంపుల్‌ ట్రస్ట్‌ ఆహ్వానించింది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠతో వేడుక ప్రారంభంకానుంది. ఇవాల్టి నుంచి ఏడు రోజుల పాటు ప్రాణప్రతిష్ట జరగనుంది.


జనవరి 16
ఈరోజు ప్రాణప్రతిష్ఠ క్రతువులు ప్రారంభం కానున్నాయి. ఆలయ ట్రస్ట్ నియమించిన హోస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం  ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ జరగనుంది. 


జనవరి 17
రామ్ లల్లా విగ్రహం ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు అయోధ్య ఆలయానికి చేరుకుంటారు.


జనవరి 18
గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు నిర్వహిస్తారు. 


జనవరి 19
యజ్ఞం ప్రారంబంకానుంది. తర్వాత 'నవగ్రహ' 'హవన్' స్థాపన జరుగుతుంది.


జనవరి 20
రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో కడుగుతారు, ఆ తర్వాత వాస్తు శాంతి 'అన్నాధివాస్' ఆచారాలు జరుగుతాయి.


జనవరి 21
రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, చివరకు శంకుస్థాపన చేస్తారు.


జనవరి 22
ప్రధాన "ప్రాణ్‌ ప్రతిష్ఠ" వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.


జనవరి 21 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి భక్తులను రానివ్వరు. జనవరి 23 నుంచి దర్శన భాగ్యం కల్పిస్తారు.