తెలంగాణలో హంగ్‌? ABP C Voter ఒపీనియన్ పోల్‌లో సంచలన విషయాలు

ABP C Voter Opinion Poll: 5 రాష్ట్రాల ఎన్నికలపై ABP సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌ ఆసక్తికర అంచనాలు వేసింది.

Ram Manohar Last Updated: 09 Oct 2023 06:02 PM
రాజస్థాన్ లో గెలిచేది ఈ పార్టీనే.!

రాజస్థాన్ లో ఎన్నికల ఫలితాలపై ఏబీపీ సీ ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 59 నుంచి 69 స్థానాలు, బీజేపీ 127 నుంచి 137 స్థానాలు, బీఎస్పీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. ఇతరులు 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ దే అధికారం

మధ్యప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై ఏబీపీ సీ ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 230 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 113 నుంచి 125 స్థానాలు, బీజేపీ 104 నుంచి 116 స్థానాలు, బీఎస్పీ 2, ఇతరులు 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ వైపే మొగ్గు

చత్తీస్ గఢ్ లో ఎన్నికల ఫలితాలపై ఏబీపీ సీ ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 45 నుంచి 51 స్థానాలు, బీజేపీ 39 నుంచి 45 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది.

దక్షిణ చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ దే హవా

చత్తీస్ గఢ్ లో ఎన్నికల ఫలితాలపై ఏబీపీ సీ ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దక్షిణ చత్తీస్ గఢ్ లో మొత్తం 12 సీట్లకు గానూ కాంగ్రెస్ 46 శాతం, బీజేపీ 42 శాతం, ఇతరులు 12 శాతం స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది.

మిజోరంలో అధికారం ఈ పార్టీదే.!

మిజోరంలో ఏబీపీ సీ ఓటర్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. మొత్తం 40 స్థానాలకు గానూ బీజేపీ మిత్రపక్షం, ప్రస్తుతం అధికారంలో ఉన్న మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) 13 నుంచి 17 స్థానాలు, కాంగ్రెస్ 10 నుంచి 14 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 

తెలంగాణలో హంగ్ ప్రభుత్వం.?

తెలంగాణలో ఏబీపీ సీ ఓటర్స్ సర్వే ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 119 స్థానాలకు గానూ కాంగ్రెస్ 48 నుంచి 60 స్థానాలు, బీజేపీ 5 నుంచి 11, బీఆర్ఎస్ 43 నుంచి 55 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే ఇతరులు 5 నుంచి 11 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Background

ABP C Voter Opinion Poll:


ఎన్నికల సమయం వచ్చిందంటే రకరకాల సర్వేలు తెగ హడావుడి చేసేస్తాయి. కానీ...అందులో కొన్ని మాత్రం సైంటిఫిక్‌గా ఉంటాయి. ఇలాంటి సైంటిఫిక్‌ సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌లో ముందంజలో ఉంటుంది ABP C Voter సర్వే. ఈ ఏబీపీ సీ ఓటర్‌ ఒపీనియన్ పోల్స్‌ని అంచనాలను, ఫలితాలను పరిశీలిస్తే చాలా దగ్గరగా ఉంటాయి. అంటే అక్యురసీ చాలా ఎక్కువ. ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందని ముందుగానే చెప్పింది ABP C Voter Opinion Poll. అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ పోల్ ఎంత కచ్చితంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో ఇదే అక్యూరసీ కనిపించింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసింది ఎన్నికల సంఘం. ఈ అన్ని రాష్ట్రాల్లోనూ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ (BRS),మిజోరంలో MNF ప్రభుత్వం ఉంది. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ మరోసారి గెలవాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ఇక తెలంగాణ విషయానికొస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు తప్పదని కొందరు, ఏకపక్షమే అని ఇంకొందరు వాదిస్తున్నారు. కానీ ఓటర్ల మదిలో ఏముందన్నదే ఉత్కంఠగా మారింది. ఈ సస్పెన్స్‌కి తెర వేయనుంది ABP C Voter Telangana Opinion Poll. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కారు జోరుని కాంగ్రెస్ అడ్డుకుంటుందా..? బీజేపీ దక్షిణాది కల నెరవేరుతుందా..? అన్న ఆసక్తికర విషయాలపై క్లారిటీ ఇవ్వనుంది ఈ ఒపీనియన్ పోల్. 


కర్ణాటక ఉదాహరణ..


కర్ణాటక ఎన్నికల సంగతే చూస్తే...ఫలితాల ముందు ఏబీబీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్‌కి కనిష్ఠంగా 110 సీట్లు, గరిష్ఠంగా 122 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీకి కనిష్ఠంగా 73 సీట్లు, గరిష్ఠంగా 85 సీట్లు వస్తాయని చెప్పింది. ఫలితాలు వచ్చాక..అంచనాలతో పోల్చి చూస్తే దాదాపు దగ్గరగానే ఉన్నాయి. కాంగ్రెస్ 135 సీట్లతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ 65 సీట్లతో సరిపెట్టుకుంది. అప్పటికే ABP సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌పై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. కర్ణాటక ఫలితాల తరవాత ఈ నమ్మకం రెట్టింపైంది. అందుకే..ఈ సారి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అంచనాలపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపై ఫోకస్ కాస్త ఎక్కువగానే ఉంది. బీజేపీ ఈ రాష్ట్రంలో పుంజుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఆ మధ్య జరిగిన GHMC ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి గట్టి పోటీ ఇచ్చింది. సౌత్‌లో నిలదొక్కుకోవాలని చూసిన కాషాయ పార్టీకి ఇది కొంత జోష్‌నిచ్చింది. దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించడమూ ఊపునిచ్చింది. ఇదే జోరుతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనుంది. సౌత్‌లో నిలబడడానికి బీజేపీకి ఇదో లిట్మస్ టెస్ట్‌గా మారింది. అందుకే...ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో ABP సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌ అంచనాలపైనా ఉత్కంఠ నెలకొంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.