Assembly Election Results 2024: 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హర్యానా, జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అరకొర మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది... కాంగ్రెస్‌ పుంజుకుంటుందా అన్న చర్చ మధ్య ఎన్నికలు జరిగాయి. మొత్తానికి ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్స్‌ను చూస్తే మాత్రం టీ20 మ్యాచ్‌ కంటే ఉత్కంఠభరితంగా ఉన్నాయి ఫలితాలు. 


హర్యానాలో హోరాహోరీ


హర్యానాలో కాంగ్రెస్ సునామీ ఖాయమనుకున్న టైంలో  ఫలితాల సరళి మారిపోయింది. ఎగ్జిట్‌పోల్ అంచాలను తలకిందులు చేస్తూ అక్కడ ఫలితాలు వస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసినా అందుకు భిన్నంగా ఫలితాలు ఉన్నాయి. 90 స్థానాలు ఉన్న హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కనిపించినప్పటికీ తర్వాత అనూహ్యంగా బీజేపీ రేసులోకి వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. జులానాలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వినేష్‌ ఫోగట్‌ విజయం దిశగా కొనసాగుతున్నారు. 


దూసుకెళ్లి పడిపోయిన కాంగ్రెస్


హర్యానాలో ఒక దశలోనే పోలింగ్ జరిగింది. 67.90% ఓటింగ్ నమోదు అయింది. 90 అసెంబ్లీ సీట్లు ఉన్న హర్యానాలో 46 సీట్లు వచ్చిన వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 60 సీట్లకుపైగా కాంగ్రెస్ లీడ్‌లో ఉన్నట్టు కనిపించినా ఈవీఎంలు లెక్కించే సరికి ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్‌ 40 స్థానాలకు పడిపోయింది. 20 స్థానాల్లో ఉన్న బీజేపీ 40కిపైగా స్థానాలు ఆధిక్యంలోకి వచ్చింది. ఈ ఫలితాలు టీ 20 మ్యాచ్‌ను తలపిస్తున్నాయి. ఫలితాలసరళి క్షణ క్షణం మారుతోంది. 


ఇండీ కూటమిదే జమ్మూకశ్మీర్‌


జమ్మూకశ్మీర్‌లో మొదట్లో కాంగ్రెస్‌ కూటమికి, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్టు కనిపించినా తర్వాత మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీ దూసుకెళ్లాయి. తర్వాత నుంచి ఎక్కడా వెనక్కి దిరిగి చూసుకోకుండా ఆధిక్యం చూపించాయి.  ఇక్కడ కూడా ఎగ్జిట్‌ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండీ కూమిటి పార్టీలు అధికారం కైవశం చేసుకునేలా ఫలితాలు సాధిస్తున్నాయి. 


ప్రభావం చూపలేకపోయిన కమలం


జమ్మూకశ్మీర్‌లో కూడా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మాత్రం 46 స్థానాల్లో ఆధిక్యం రావాలి. ఇక్కడ ఇండీ కూటమి అంటే కాంగ్రెస్, ఎన్సీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో పోలింగ్ జరిగింది.


అలా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి


2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, కేంద్ర పాలితంగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ ప్రక్రియ పూర్తైన ఐదేళ్ల తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూటమిగా పోటీ చేస్తే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP), భారతీయ జనతా పార్టీ (BJP) వేర్వేరుగా పోటీ చేశాయి. 


Also Read: జమ్మూకశ్మీర్‌లో ఇండీ కూటమి ఆధిక్యం - హర్యానాలోహోరాహోరీ