Param Vishisht Seva Medal:  భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పరమ విశిష్ట సేవా పతకం అందుకున్నారు. 






జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతలను నిర్వహించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే.



  • చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే.

  • జనరల్ పాండే భారత సైన్యానికి 29వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌.

  • నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాండే చదువుకున్నారు.

  • బ్రిటన్‌లోని కంబెర్లీ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.

  • హయ్యర్ కమాండ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులు చేశారు.

  • 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ (బాంబే సాపర్స్)లో చేరారు.

  • 39 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో విభిన్న వాతావరణాల్లో, వైవిధ్యభరితమైన  కార్యకలాపాలకు పాండే నాయకత్వం వహించారు. 






దీంతో పాటు కెప్టెన్ అశుతోష్ కుమార్‌కు (మరణానంతరం) ప్రకటించిన శౌర్య చక్ర పురస్కారాన్ని వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి అందించారు. వీరితో పాటు మరికొంతమందికి శౌర్య చక్ర పురస్కారాన్ని అందించారు కోవింద్.


Also Read: SC on Sedition Law: రాజద్రోహం కేసులపై కేంద్రానికి సుప్రీం 24 గంటల డెడ్‌లైన్


Also Read: Bangkok News: 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం- చివరికి ఏం చేశాడంటే?