Anantnag Encounter: 


మూడు రోజులుగా గాలింపు..


జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ముగ్గురు జవాన్లను బలి తీసుకున్న ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టారు జవాన్లు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మూడు రోజులుగా వాళ్ల కోసం అణువణువూ జల్లెడ పడుతున్నారు భారత సైనికులు. ఆర్మీ కంట పడకుండా ఓ పెద్ద కొండపైన ఉన్న గుహలో దాక్కున్నట్టు తెలుస్తోంది. అక్కడికి చేరుకోవడం ఆర్మీకి ఇబ్బందికరంగా మారింది. చుట్టూ అడవి, కొండలు. వీటిని దాటుకుని అక్కడికి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ...ఇక్కడే మరో వాదన వినిపిస్తోంది. ఆ టెర్రరిస్ట్‌లకు ఆ పైకి ఎలా వెళ్లాలో తెలుసు. అది ఎంత కష్టమో కూడా తెలుసు. దట్టమైన ఆ అడవిలో అంతా చీకటిగానే ఉంది. ఆ చీకట్లో టెర్రరిస్ట్‌లను పట్టుకోవడం అంత సులువైన పనేమీ కాదు. అందుకే ఇన్ని రోజుల పాటు ఆపరేషన్ కొనసాగుతోంది. అక్కడికి చేరుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు విశ్వసీనయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 13న తెల్లవారుజామున ఉగ్రవాదులపై దాడి చేయాలని ఆర్మీ ప్లాన్ చేసుకుంది. కానీ...అది సాధ్యం కాలేదు. 


"కొండపైన ఓ గుహలో ఉగ్రవాదులు దాక్కున్నారు. అక్కడికి వెళ్లడం అంత సులభం కాదు. దారి చాలా ఇరుగ్గా ఉంది. దట్టమైన అడవి. అంతా చీకటి. వీటికి తోడు చుట్టూ గుట్టలు కూడా ఉన్నాయి. వాటిని దాటుకుని ఉగ్రవాదులున్న స్థావరానికి వెళ్లడం సవాలుతో కూడుకున్న పని. వాళ్లని చేరుకోడానికి ఏదో దారి కనిపెట్టినా చీకటి కారణంగా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నారు. సైనికులు ఈ కొండ వద్దకు చేరుకోగానే టెర్రరిస్ట్‌లు కాల్పులు మొదలు పెట్టారు. నిజం చెప్పాలంటే భారత సైనికులు దిక్కు తోచకుండా ఉండిపోయారు. ఈ కొండ ఎక్కినా కింద పడిపోయే ప్రమాదం ఎక్కువ"


- విశ్వసనీయ వర్గాలు 






కొండను చుట్టుముట్టిన ఆర్మీ..


ఆ ఏరియా అంతా టెర్రరిస్ట్‌లకు బాగా తెలుసు. అందుకే అంత ధీమాగా ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. పైకి వెళ్లే మార్గం ఆ ఉగ్రవాదులకు తప్ప ఇంకెవరికీ తెలిసుండకపోవచ్చన్న వాదనలూ వినిపిస్తున్నాయి. సైనికులు ఎలాగోలా పైకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నా పై నుంచి దాక్కుని కాల్పులు జరుపుతున్నారు ముష్కరులు. ఇప్పటికైతే ఇండియన్ ఆర్మీ ఆ కొండను చుట్టుముట్టింది. ఇజ్రాయేల్ నుంతి తెప్పించిన డ్రోన్‌లతో నిఘా పెడుతోంది. పేలుడు పదార్థాలనూ సిద్ధంగా ఉంచుకుంది. లొకేషన్‌ కనిపించిన వెంటనే దాడి చేసేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకుంది. ఆ గుహలో టెర్రరిస్ట్‌లకు ఆయుధాలు, ఆహారం అంతా అందుబాటులోనే ఉందని, వాళ్లు ఎన్నిరోజులైనా దాక్కునేలా ముందుగానే స్కెచ్ వేసుకున్నట్టు సమాచారం. 


Also Read: ఒకే దేశం ఒకే ఎన్నికపై స్పీడ్ పెంచిన కేంద్రం, సెప్టెంబర్ 23న తొలిభేటీ