One Nation One Election:



ఒకే దేశం, ఒకే ఎన్నికపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిన ఈ కమిటీ...కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 23న తొలిసమావేశం నిర్వహించనున్నట్టు స్వయంగా రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా...రామ్‌నాథ్ చేసిన ఈ ప్రకటన ఆసక్తి రేపుతోంది.