Eat Mobility : ఇప్పుడంతా ఈ యుగం. అదే వాహన రంగంలో అయితే ఈ అంటే ఎలక్ట్రిక్. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రధాన కంపెనీలు అన్నీ ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పరుగులు పెడుతున్నాయి. ఓ పది.. ఇరవై ఏళ్లలో ఫీచర్ ఫోన్లు మాయమైపోయినట్లుగా డీజిల్, పెట్రోల్ వాహనాలు మాయమైపోయి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ అనే పదానికి కొత్త అర్థం చెప్పారు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా. ఎందుకంటే ఆయన చూసిన ఓ వాహనం అలాగే ఉంది.
నలుగురు చక్కగా నాలుగు వైపులా కూర్చున్నారు. వారి ముందు అన్ని వంటకాలు వడ్డించి ఉన్నాయి. వారి తిండి వారు ఆస్వాదిస్తున్నారు. కానీ ఆ డైనింగ్ టేబుల్ మాత్రం చురుగ్గా కదులుతుంది అంతే కాదు పెట్రోల్ బంకుకు వచ్చి పెట్రోల్ కూడా కొట్టించింది. తర్వాత దానంతటకు అది కదిలిపోయింది. ఈ వీడియో నచ్చడంతో ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. ఇక్కడ ఈ అంటె ఈట్ అని ట్వీట్ చేశారు.
ఆనంద్ మహింద్రా పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.