Amit Shah in Madhya Pradesh: మధ్యప్రదేశ్ (Madhya Pradesh Elections) లో కూడా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎలాగైనా అక్కడ అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) విదిశా జిల్లాలోని సిరోంజ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిరోంజ్ ప్రాంత బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ శర్మకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న అయోధ్య రాంలాలా జీవితానికి అంకితం చేయనున్నట్లు అమిత్ షా (Amit Shah) తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక మధ్యప్రదేశ్ (Madhya Pradesh Elections) ప్రజలందరికీ రాంలాలా దర్శనం ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై అక్కడున్న ఓ బీజేపీ సీనియర్ నేత స్పందిస్తూ.. అయోధ్య రామ మందిర దర్శనం కోసం మేం డబ్బులు ఖర్చు పెట్టాలా? అని అడిగారు. దీనిపై అమిత్ షా (Amit Shah) స్పందిస్తూ.. మీరు ఎలాంటి ఖర్చూ చేయొద్దని, వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ (Madhya Pradesh Elections) లో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం ఉచితంగా కల్పిస్తామని అన్నారు. అయితే, దశల వారీగా ప్రజలను అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని పెట్టినట్లుగా అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. భారీ ఓట్లతో బీజేపీని గెలిపించాలని అమిత్ షా (Amit Shah) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామ మందిర నిర్మాణం ఎప్పుడని రాహుల్ గాంధీ పదే పదే అడిగేవారని అమిత్ షా (Amit Shah) గుర్తు చేశారు. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగుతుందని ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెబుతున్నానని అమిత్ షా (Amit Shah) తెలిపారు.