ABP  WhatsApp

AWS Infrastructure: అమెజాన్ ఇన్‌ఫ్రా రీజైన్‌గా హైదరాబాద్- ఏటా 48 వేల ఉద్యోగాలకు అవకాశం!

ABP Desam Updated at: 22 Nov 2022 12:49 PM (IST)
Edited By: Murali Krishna

AWS Infrastructure: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) దేశంలో తన రెండో మౌలిక సదుపాయాల ప్రాంతాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.

అమెజాన్ ఇన్‌ఫ్రా రీజైన్‌గా హైదరాబాద్

NEXT PREV

AWS Infrastructure: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారత్‌లో తన రెండవ మౌలిక సదుపాయాల ప్రాంతాన్ని (infrastructure region) ప్రారంభించింది. AWS ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్‌గా ఇది ఉండనుంది. 


48 వేల ఉద్యోగాలు


దీని ద్వారా 2030 నాటికి దేశంలో $4.4 బిలియన్ల (సుమారు రూ. 36,300 కోట్లు) కంటే ఎక్కువ పెట్టుబడులు రానున్నట్లు అమెజాన్ తెలిపింది. దీని ద్వారా ఏటా 48,000 కంటే ఎక్కువ ఫుల్‌ టైమ్ ఉద్యోగాలకు అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


నేటి నుంచి డెవలపర్‌లు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, సంస్థలు, అలాగే ప్రభుత్వం, విద్య, లాభాపేక్షలేని సంస్థలు తమ అప్లికేషన్‌లను ప్రాసెస్ చేయొచ్చని పేర్కొంది. దీని ద్వారా దేశంలోని డేటా సెంటర్‌ల నుంచి తుది వినియోగదారులకు (end users) సేవలను అందించవచ్చని వెల్లడించింది.



AWS ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్.. భారత డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇస్తుంది. 2011లో మా మొదటి కార్యాలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశంలో మా దీర్ఘకాలిక పెట్టుబడిలో భాగంగా నేడు ఏజబ్ల్యూఎస్‌ను స్టార్ట్ చేశాం. భారత్‌లోని కస్టమర్‌లు, భాగస్వాములు ఇప్పుడు అప్లికేషన్‌లను ప్రాసెస్ చేయడానికి అదనపు ప్రాంతీయ మౌలిక సదుపాయాలు లభించాయి. దీని వల్ల త్వరగా పనులు జరిగే అవకాశం ఉంది.      -  ప్రసాద్ కళ్యాణరామన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవల వైస్ ప్రెసిడెంట్ 


ఆర్థిక వ్యవస్థకు బూస్ట్


అకో జనరల్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, క్లెవెర్టాప్, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (MeitY), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, తెలంగాణ ప్రభుత్వం, HDFC బ్యాంక్, జూపిటర్, లెండింగ్‌కార్ట్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఫిజిక్స్ వాల్లా, టాటా ఎల్క్సీతో సహా ఏడబ్ల్యూఎస్‌కు భారత్‌లో లక్షలాది మంది కస్టమర్‌లు ఉన్నారు.



1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ ప్రకారం 'ఇండియా క్లౌడ్' పెద్ద విస్తరణ, ఆవిష్కరణల కోసం సిద్ధంగా ఉంది. డేటా కేంద్రాలు డిజిటల్ ఎకో సిస్టమ్‌లో చాలా ముఖ్యం. భారతదేశంలో తమ డేటా సెంటర్‌లను విస్తరించడంలో AWS పెట్టుబడులు పెట్టడం స్వాగతించదగిన పరిణామం. ఇది భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు సహాయపడుతుంది. - రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి


కేటీఆర్


హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన ఏడబ్ల్యూఎస్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.



హైదరాబాద్‌లో సుమారు రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన AWS నిబద్ధతను మేము స్వాగతిస్తున్నాం. భారతదేశంలో ప్రగతిశీల డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని ఈ పెట్టుబడులు మరింత బలోపేతం చేస్తున్నాయి.  - కేటీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి


Also Read: Shraddha Murder Case: ఆ క్షణం అలా జరిగిపోయింది- నాకు సరిగా గుర్తులేదు: అఫ్తాబ్

Published at: 22 Nov 2022 12:43 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.