Air India Flight 171 Crash: విమానయాన రంగంలో సలహాదారు, అనుభవజ్ఞుడైన పైలట్ ఒకరు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. AI 171 విమానం స్టెబిలైజర్‌లో లోపం ఉందేమో పరిశీలించాలని దర్యాప్తు అధికారులను సూచించారు. ఇది ప్రమాదానికి కారణం కావచ్చునని అభిప్రాయపడ్డారు.
ఎయిర్ ఇండియా విమానం AI171 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది ప్రయాణికులతోపాటు విమానం కూలిన భవనంలో ఉన్న 19 మంది మరణించారు.
జులై 12న విడుదలైన దర్యాప్తు ప్రాథమిక నివేదిక ప్రకారం, సిబ్బంది అహ్మదాబాద్‌లోని ఇంజనీర్లకు స్టెబిలైజర్‌లో లోపం గురించి ప్రస్తావించారు. విమానయాన నిపుణుడు కెప్టెన్ ఎహ్సాన్ ఖాలిద్ 'PTI'తో మాట్లాడుతూ, "దర్యాప్తు అధికారులు ఫ్లైట్ డేటా రికార్డర్‌ను స్టెబిలైజర్ ఇన్‌పుట్ డేటా కోసం కూడా పరిశీలించాలి, సరిగ్గా మరమ్మత్తు చేయకపోవడం వల్ల బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి దారితీసిందా అని చూడాలి"అని అన్నారు.
స్టెబిలైజర్ విమానం వెనుక భాగంలో ఉంటుంది. పైలట్ ఆదేశాల మేరకు విమానం ముందు భాగాన్ని పైకి కిందికి తీసుకురావడంలో సహాయపడుతుంది. ఖాలిద్ మాట్లాడుతూ," 'టేకాఫ్ రోల్' టైంలో స్టెబిలైజర్‌లో ఏదైనా లోపం ఏర్పడితే, టేకాఫ్ తీసుకునే పైలట్ కొన్ని రూల్స్ పాటించాలి: 'కంట్రోల్ కాలమ్ నుంచి ఒక చేతిని తీసి, వంగి, థ్రస్ట్ లివర్ అసెంబ్లీ కింద ఉన్న స్టెబిలైజర్ కంట్రోల్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి.' అని చెప్పారు.
అయితే విమానం నడుపుతున్న సిబ్బందిలో ఒకరు పొరపాటున స్టెబిలైజర్‌ను ఆపివేయడానికి బదులుగా రెండు ఇంజిన్‌ల ఇంధనాన్ని ఆపివేసి ఉండవచ్చని ఖాలిద్ అన్నారు. అయితే రెండు స్విచ్‌లు తాకినప్పుడు వేర్వేరు ఎక్స్‌పీరియన్స్ ఎదురవుతుందని అన్నారు.
విమానం సురక్షితంగా పైకి ఎగురుతున్నప్పుడు పైలట్‌లు విమానం ముందు భాగాన్ని మాత్రమే చూస్తారని, మరెక్కడా చూడరని ఖాలిద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, "'ఈ థియరీతో సమస్య ఉంది. లోపం తలెత్తినప్పడు స్టెబిలైజర్‌ను ఆపివేసే బాధ్యత టేకాఫ్ తీసుకునే పైలట్‌దే, మరొక పైలట్‌ది కాదు.'