IndiGo Flight Returns To Delhi After Technical Snag: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఢిల్లీ నుండి ఇంఫాల్‌కు బయలుదేరిన ఒక విమానం (ఫ్లైట్ 6E-5118) జూలై 17 ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఈ సంఘటన 24 గంటలలో ఇండిగో విమానానికి సంబంధించిన రెండవ సాంకేతిక సమస్య ఇది. భద్రతా జాగ్రత్తల దృష్ట్యా, పైలట్లు విమానాన్ని ఢిల్లీకి తిరిగి వచ్చారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది . తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం తిరిగి ఇంఫాల్‌కు వెళ్లింది. ఇండిగో అధికారులు ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికులు, సిబ్బంది, విమానం యొక్క భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని ఇండిగో ప్రకటించింది.
బుధవారం ఢిల్లీ నుండి గోవాకు బయలుదేరిన మరో ఇండిగో విమానం (6E-6271, ఎయిర్‌బస్ A320neo, VT-IZB) ఆకాశంలో ఉండగా ఒక ఇంజన్ వైఫల్యం కారణంగా ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ విమానం రాత్రి 9:52 PMకి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులను మరో విమానంలో గోవాకు తరలించారు ఈ రెండు సంఘటనలు 24 గంటల వ్యవధిలో జరిగాయి, ఇది ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు విమానాల సన్నద్ధతపై చర్చ ప్రారంభమయ్యేలా చేసింది. ఇండిగో ఈ సాంకేతిక సమస్య యొక్క నిర్దిష్ట స్వభావాన్ని వెల్లడించలేదు, కానీ ఇది చిన్నదని పేర్కొంది.
ఇండిగో , ఎయిర్ ఇండియా విమానాలలో సాంకేతిక సమస్యలు నమోదైన సందర్భాలలో, DGCA ఎయిర్‌లైన్స్‌ను మరింత కఠినమైన నిర్వహణ , భద్రతా తనిఖీలను అనుసరించాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా యొక్క బోయింగ్ 787 ఫ్లీట్‌పై జూన్ 2025లో జరిగిన ఒక హై-లెవల్ సమీక్షలో, DGCA నిర్వహణ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంజనీరింగ్, ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ యూనిట్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని, తగిన స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. జూన్ 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత, DGCA దేశవ్యాప్తంగా ప్రముఖ విమానాశ్రయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో రన్‌వే మార్కింగ్‌లు దెబ్బతినడం, గడువు ముగిసిన టైర్లతో విమానాలు నడపడం, సిమ్యులేటర్‌లలో అప్‌డేట్ కాని సాఫ్ట్‌వేర్ వంటి లోపాలు గుర్తించాకుయ DGCA ఈ లోపాలను సరిచేయడానికి సంబంధిత సంస్థలకు ఏడు రోజుల గడువు ఇచ్చి, భవిష్యత్తులో నిరంతర సర్వైలెన్స్ కొనసాగిస్తామని తెలిపింది.