ఎయిర్ ఇండియా విమానం రూట్ డైవర్ట్ చేశారు. న్యూయార్క్ - ఢిల్లీ విమానం (AI-102)ను అత్యవసరంగా లండన్‌కు మళ్లించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా సోమవారం (ఫిబ్రవరి 20) రాత్రి లండన్‌కు మళ్లించినట్లు జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
న్యూయార్క్ లో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం (AI-102) సోమవారం రాత్రి 11.25 గంటలకు ఢిల్లీకి రావాల్సి ఉంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా ఫ్లైట్ నేటి రాత్రి దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాలి. కానీ విమానం నార్వే క్రాస్ అవుతున్న సమయంలో లండన్, యూకేకు విమానాన్ని డైవర్డ్ చేశారు. విమానంలో ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఢిల్లీకి వస్తున్న విమానాన్ని లండన్ కు మళ్లీంచి టేకాఫ్ చేసినట్లు సమాచారం.
విమానానికి బాంబు బెదిరింపు కాల్..
ఫిబ్రవరి 20 (సోమవారం) తెల్లవారుజామున ఢిల్లీ నుంచి దేవ్‌గఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని బాంబు బెదిరింపుతో లక్నోకు మళ్లించారు. బెదిరింపు కాల్ రావడంతో అధికారులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టగా ఫేక్ కాల్ అని తేలింది. అనంతరం ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీ నుంచి దేవ్ గఢ్ వెళ్లాల్సిన విమానం లక్నో నుంచి టేకాఫ్ అయింది. మధ్యాహ్నం 12:20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ఐసోలేషన్ బేకు తరలించామని చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే కూర్చుని విమానంలో బాంబుందని ఫోన్ కాల్
హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనిఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలను నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదు. అయినప్పటికీ.. ఇది ప్రయాణికుల భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి.. క్షణ్ణంగా సోదాలు నిర్వహించి అన్ని ఓకే అన్న తర్వాత ప్రయాణాలకు అనుమతించారు.
తర్వాత పోలీసులు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరా అని ఆరా తీశారు. సెల్ ఫోన్ టవర్ ఆధారంగా సెర్చ్ చేస్తే.. చివరికిఆ ఫోన్ నెంబర్ కూడా.. ఎయిర్ పోర్టులోనే ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే ఎయిర్ పోర్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అలా ఫేక్ కాల్ చేశాడో తెలుసుకుని.. వారి మరింత ఆగ్రహానికి గురై ఉంటారు. ఎందుకంటే... ఆ పెద్ద మనిషిని.. లేటు రావడమే కాకుండా.. తనను అనుమతించలేదని.. ఆ విమానాన్ని ఆలస్యం చేయాలని ఇలా ఫోన్ కాల్ చేశాడు. అతని పెరు ఆజ్మీరా భద్రయ్యగా పోలీసులు గుర్తించారు.
చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య ఈ తుంటరని చేశాడు. విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విమానం ఎక్కి చెన్నై వెళ్లాల్సిన వ్యక్తి చివరికి.. జైల్లో కూర్చున్నాడు.