Air India Flights to Resume from August 1: ఎయిర్ ఇండియా తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు నుంచి తిరిగి ప్రారంభించనుంది. జూన్ 12 నాడు AI 171 బోయింగ్ విమాన ప్రమాదం జరగడంతో విధించిన 'భద్రతా విరామం' తరువాత అంతర్జాతీయ విమానాలను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఎయిర్ ఇండియా మంగళవారం (జూలై 15, 2025) నాడు ప్రకటించింది.

ఈ భద్రతా విరామం సమయంలో ఎయిర్ ఇండియా (Air India) తన బోయింగ్ 787 విమానాలను పూర్తిగా సురక్షితమా కాదా తేల్చడానికి అదనపు తనిఖీలు చేసింది. అదే సమయంలోపాకిస్తాన్, మధ్యప్రాచ్యం దేశాల మీదుగా వైమానిక మార్గాలు మూసివేయబడటం వల్ల ప్రభావితం అయిన విమాన సర్వీసుల సమయాన్ని తిరిగి నిర్ణయించారు. ఎయిర్ ఇండియా ఆగస్టు 1న కొన్ని అంతర్జాతీయ విమానాలను పునరుద్ధరిస్తుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను అక్టోబర్ 1, 2025 నుంచి పూర్తి స్థాయిలో పునురుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది. 

1. అహ్మదాబాద్ నుండి లండన్ (హీత్రూ)ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ నుండి లండన్ (హీత్రూ ఎయిర్ పోర్టు) వరకు వారానికి 3 సార్లు విమాన సర్వీసులను నడుపుతుంది. ఇది కొత్త సర్వీసు. కాగా, ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ (గ్యాట్విక్) మధ్య నడుస్తున్న వారానికి 5 విమాన సర్వీసులకు బదులుగా ఈ కొత్త సర్వీసును ఎయిరిండియా అందుబాటులోకి తేనుంది. 

2. పునరుద్ధరించబడిన విమానాలు ఢిల్లీ- లండన్ (హీత్రో): ఢిల్లీ నుంచి లండన్ కు తగ్గించిన రెండు విమాన సర్వీసులను తిరిగి పునరుద్ధరించారు. ఇప్పుడు జూలై 16వ తేదీ నుంచి వారానికి మొత్తం 24 విమానాలు నడుస్తాయి.

ఢిల్లీ- జూరిచ్: ఆగస్టు 1 నుంచి వారానికి 4 నుండి 5 విమాన సర్వీసులను ఎయిరిండియా నడపపుంది. 

తూర్పు ఆసియాఢిల్లీ- టోక్యో (హనేడా): ఢిల్లీ నుంచి టోక్యో మధ్య తగ్గించిన 2 విమానాలను పునరుద్ధరించారు. ఆగస్టు 1 నుంచి వారానికి మొత్తం 7 విమానాలు ఉంటాయి.

ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్): ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత తగ్గించిన 2 విమానాలను పునరుద్ధరించారు. సెప్టెంబర్ 1 నుండి వారానికి మొత్తం 5 విమానాలు నడపనుంది.

3. సెప్టెంబర్ 30 వరకు సర్వీసుల తగ్గింపు ఉంటే మార్గాలుయూరప్:బెంగళూరు-లండన్ (హీత్రో): ప్రస్తుతం వారానికి 6 విమానాలు నడుస్తుండగా, ఆగస్టు 1 నుండి కేవలం 4 విమానాలకు తగ్గింపు.

ఢిల్లీ-బర్మింగ్‌హామ్: ఇప్పుడు వారానికి 3 విమాన సర్వీసులు నడుస్తుండగా, వారానికి 2 మాత్రమే 

ఢిల్లీ-పారిస్: ఆగస్టు 1 నుంచి 12 కి బదులుగా వారానికి 7 విమాన సర్వీసులు మాత్రమే.

ఢిల్లీ-మిలన్: జూలై 16 నుంచి 4 ఉన్న సర్వీసులను వారానికి 3 విమానాలకు తగ్గింపు.

ఢిల్లీ-కోపెన్‌హాగన్: ఇప్పుడు 5 సర్వీసులకు బదులుగా 3 విమానాలు మాత్రమే.

ఢిల్లీ-వియన్నా: వారానికి 4 విమానాలకు బదులుగా 3 విమాన సర్వీసులు.

అమృత్‌సర్ -బర్మింగ్‌హామ్: ప్రస్తుతం వారానికి 2 విమానాలు నడుస్తుండగా, సెప్టెంబర్ 1 నుండి మళ్లీ 3 విమానాల సేవలు 

ఢిల్లీ-ఆమ్‌స్టర్‌డామ్: ప్రస్తుతం 7 కి బదులుగా 5 విమానాలు, కానీ ఆగస్టు 1 నుండి మళ్లీ 7 విమానాలు పునరుద్ధరణ.

ఉత్తర అమెరికా:ఢిల్లీ-వాషింగ్టన్ (డాలస్): 5 సర్వీసుల నుంచి 3 విమానాలకు తగ్గిస్తారు.

ఢిల్లీ-చికాగో: 7 కి బదులుగా 3 విమానాలు, కానీ ఆగస్టులో 4 విమాన సర్వీసులు ఉంటాయి.

ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో: వారానికి 10 నుండి 7 విమానాలకు తగ్గించారు.

ఢిల్లీ-టొరంటో: 13 సర్వీసుల నుంచి 7 విమానాలకు తగ్గించారు.

ఢిల్లీ-వాంకోవర్: ప్రస్తుతం ఉన్న 7 సర్వీసులను 4 విమానాలకు తగ్గించారు.

ఢిల్లీ-న్యూయార్క్ (JFK): జూలై 16 నుంచి 7 కి బదులుగా 6 విమానాలు.

ముంబై-న్యూయార్క్ (JFK): ఆగస్టు 1 నుంచి 7 కి బదులుగా 6 విమాన సర్వీసులు.

ఢిల్లీ-న్యూయార్క్ (న్యూఆర్క్): జూలై 16 నుంచి 5 కి బదులుగా 4 విమానాలు రాకపోకలు.

ఆస్ట్రేలియా:ఢిల్లీ-మెల్‌బోర్న్: వారానికి 7 కి బదులుగా 5 విమానాలు సేవలు.

ఢిల్లీ-సిడ్నీ: 7 కి బదులుగా 5 విమానాలకు తగ్గింపు.

ఆఫ్రికా:ఢిల్లీ-నైరోబి: ఆగస్టు 31 వరకు వారానికి 3 విమానాలు, కానీ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు సేవలు నిలిపివేత.

4. సెప్టెంబర్ 30 వరకు సేవలు పూర్తిగా నిలిపివేసే మార్గాలుఅమృత్‌సర్ -లండన్ (గ్యాట్విక్): AI169/170 – వారానికి 3 విమాన సర్వీసులు

గోవా (మోపా)-లండన్ (గ్యాట్విక్): AI145/146 – వారానికి 3 విమానాలు

బెంగళూరు-సింగపూర్: AI2392/2393 – వారానికి 7 విమాన సర్వీసులు

పూణే-సింగపూర్: AI2111/2110 – వారానికి 5 విమానాలు

Air India ప్రయాణికులకు గమనికఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 30 మధ్య విమానాలు రద్దు అయిన ప్రయాణికులను ఎయిర్ ఇండియా సంప్రదిస్తోంది. తమ సౌకర్యం చూసుకుని, ప్రత్యామ్నాయ విమానంలో రీ-బుకింగ్ చేసుకోవచ్చు లేదా పూర్తి నగదు తిరిగి పొందవచ్చు అని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సూచించింది. ప్రయాణికులను కంపెనీ క్షమాపణలు కోరింది. ఈ పాక్షిక పునరుద్ధరణతో, ఎయిర్ ఇండియా ఇప్పుడు ప్రతి వారం 63 తక్కువ, ఎక్కువ దూరం మార్గాల్లో కలిపి మొత్తం 525 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది.