Agni Prime New Generation Ballistic Missile: ఒడిశా తీరంలో దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని ప్రైమ్'ను భారత్ శుక్రవారం (అక్టోబర్ 21) విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) వర్గాలు ఈ సమాచారాన్ని అందించాయి. ఉదయం 9.45 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలోని మొబైల్ లాంచర్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఘన ఇంధన క్షిపణి పరీక్ష సమయంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను సాధించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
క్షిపణి ప్రయాణించిన మొత్తం మార్గాన్ని రాడార్లతో పర్యవేక్షించామని, టెలిమెట్రీ పరికరాలను వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణి వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు. ఈ క్షిపణి చివరి పరీక్షను డిసెంబర్ 18న ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించగా, అది విజయవంతమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇంతకు ముందు రెండు పరీక్షలు
ఈ క్షిపణి స్వదేశీ అగ్ని క్షిపణి అప్ గ్రేడెడ్ వెర్షన్ అని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి పరీక్ష సమయంలో దాని గరిష్ట లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుందన్నారు. ఇంతకు ముందు, ఈ క్షిపణి రెండు పరీక్షలు జరిగాయి. ఇది దాని మూడో పరీక్ష. అగ్ని ప్రైమ్ ఘన ఇంధనంపై ఆధారపడిన క్షిపణి. ఇది అధునాతన రింగ్ లేజర్ గారాన్స్కోప్ ఆధారంగా నావిగేషన్ వ్యవస్థ ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. దీని గైడెడ్ సిస్టమ్ పూర్తిగా ఎలక్ట్రో మెకానికల్ యాక్చువేటర్లను కలిగి ఉంటుంది.
అణు సామర్థ్యాన్ని కలిగి ఉంది
అగ్ని ప్రైమ్ క్షిపణి 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల పరిధిని ఛేదించగలదు. వీటితో పాటు అగ్ని ప్రైమ్ మిస్సైల్ మిర్వ్ (మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ టీంట్రీ వెహికల్) టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఇది దాని సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ క్షిపణిలో, ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేక అణ్వాయుధాలను ఒకేసారి తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుంది, దీని ద్వారా వివిధ లక్ష్యాలను టార్గెట్ చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు అగ్ని క్షిపణి వ్యవస్థ అనేక వెర్షన్లు భారతదేశంలో తయారయ్యాయి. అగ్ని క్షిపణి భారతదేశంలో తయారు చేసి అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి. ఇది అణు సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇది కాకుండా, ఈ బాలిస్టిక్ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో లక్ష్యాలను కొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Also Read: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కి కాస్త ఊరట, ఆ నిబంధనను ఎత్తివేసిన డీజీసీఏ