ABP News-CVoters Opinion Poll: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పుంజుకుని మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ నేతృత్వంలోని NDA 23 చోట్ల విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ కూటమి 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ (ABP News-CVoter Opinion Poll)లో వెల్లడైంది.
ఏబీపీ సీఓటర్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం.. NDA కూటమికి 53 శాతం ఓట్లు పోల్ కానుండగా, కాంగ్రెస్ కూటమికి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ- జేడీఎస్ పార్టీలు కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్తున్నాయి. జేడీఎస్ చేతులు కలపడంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి భారీ స్థానాలు దక్కనున్నాయి. అదే కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలను ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. మరో దక్షిణాది రాష్ట్రం తెలంగాణలోనూ 12 సీట్లు నెగ్గుతామని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమాగా ఉన్నారు.
2019లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. BJP నేతృత్వంలోని ఎన్డీఏ 26 స్థానాలు కైవసం చేసుకుంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉందని ఏబీపీ సీఓటర్ సర్వే చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. ఫలితాల్లోనూ ఇదే వచ్చింది.
[Disclaimer: Current survey findings and projections are based on CVoter Opinion Poll Computer Assisted Telephone Interview (CATI) conducted among 41,762 adults, all confirmed voters. The surveys were conducted from February 1 to March 10, 2024. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. The final data has socio-economic profiles within +/- 1% of the demographic profile of the states. We believe this will give the closest possible trends. The sample spread is across all 543 electoral constituencies in the country. The margin of error is +/- 5% and the vote share projections have been done with 95% confidence interval.]