ABP Network CEO Avinash Pandey unveils ABPLIVE Premium| న్యూఢిల్లీ: ఎంతో ప్రజాధరణ కలిగిన న్యూస్ మీడియా ఏబీపీ నెట్‌వర్క్ మరో నూతన ఆవిష్కరణను ప్రవేశపెట్టింది. మిలియన్ల యూజర్లకు మరింత ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందించేందుకు ఏబీపీ లైవ్ ప్రీమియర్ (ABPLIVE Premium) సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే ఢిల్లీలో బుధవారం నాడు ఏబీపీలైవ్ ప్రీమియం సర్వీస్‌ లాంఛ్ చేశారు. కొత్త సర్వీసును సబ్‌స్క్రైబ్ చేసుకున్న రీడర్లు పలు కేటగిరీల ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పొందవచ్చు. న్యూస్ లెటర్స్, ఏబీపీలైవ్ ప్రీమియం యూట్యూబ్ యాక్సెస్ లభిస్తుంది.  


ఏబీపీ లైవ్ ప్రీమియం సర్వీస్‌ పొందిన రీడర్లు రాజకీయ విశ్లేషణ, బిజినెస్, సినిమా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్, క్రికెట్, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక సంబంధిత కథనాలను ఒకేచోట చదవవచ్చు. నిజానిజాలను వెల్లడిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న ఏబీపీ నెట్‌వర్క్ స్పెషల్ కంటెంట్ అందించడానికి ఈ ప్రీమియర్ ఫీచర్‌ను ఆవిష్కరించింది. కచ్చితమైన సమాచారంతో పాటు విశ్లేషణాత్మక కథనాలను అందిస్తూ తమ సబ్‌స్క్రైబర్లకు మరింత చేరువ కానుంది. ఏబీపీలైవ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


ఈ సందర్భంగా ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే (ABP Network CEO Avinash Pandey) మాట్లాడుతూ.. ఏబీపీలైవ్ ప్రీమియం సర్వీస్ మా విజయానికి నాంది పలికింది. మా వ్యూయర్స్‌కు మరింత క్వాలిటీ, డెప్త్ కంటెంట్ చేరువ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పొలిటికల్ న్యూస్‌తో పాటు ఇతర కేటగిరీల నుంచి సైతం స్పెషల్ స్టోరీస్ తో మరింత అవగాహన వస్తుందన్నారు. మా సబ్‌స్క్రైబర్స్ ఇతరుల కన్నా వార్తలో ఒక అడుగు ముందే ఉంటారని ఆకాంక్షించారు.


తమ నూతన స్పెషల్ న్యూస్ సర్వీసును ఏబీపీ నెట్‌వర్క్ అతి తక్కువ ధరకే అందిస్తోంది. లాంఛింగ్ ఆఫర్ కింద కేవలం రూ.21 చెల్లించి ఏబీపీ ప్రీమియం వార్షిక సభ్యత్వం పొందవచ్చు. రెగ్యూలర్ ప్రైస్ రూ. 2099 కాగా, లాంఛింగ్ సందర్భంగా నామమాత్రపు ధరతో సర్వీసును అందిస్తోంది. ఏబీపీలైవ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి సబ్‌స్క్రిప్షన్ పొందిన యూజర్లు ఏబీపీ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్, విశ్లేషణాత్మక కథనాలను చదివేయండి. ప్రస్తుతానికి ఈ ప్రీమియం న్యూస్ సర్వీస్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారికి మొదటి మూడు ప్రీమియం స్టోరీలను యాక్సెస్ ఇచ్చారు. మిగతా భాషల్లో త్వరలోనే ప్రీమియం సర్వీస్ లాంచ్ చేయనున్నారు.