Indian Navy Sailor Recruitment Notification: ఇండియన్ నేవీలో 'సెయిలర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా ఎంట్రీ (02/2024 బ్యాచ్) కింద ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత క్రీడాంశంలో ఇంటర్నేషనల్‌ లేదా జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జులై 20 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్‌ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


 వివరాలు..


*  సెయిలర్‌- స్పోర్ట్స్ కోటా ఎంట్రీ- 02/2024 బ్యాచ్


➥ డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ)/ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ)


అర్హత: 10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్‌/జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థులు 17.5-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.11.1999 - 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి.


క్రీడాంశాలు (పురుష అభ్యర్థులకు): అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఈక్వెస్ట్రియన్(గుర్రపుస్వారీ), ఫుట్‌బాల్, ఫెన్సింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, స్క్వాష్, గోల్ఫ్, టెన్నిస్, కయాకింగ్ అండ్ కానోయింగ్, రోయింగ్, షూటింగ్ అండ్ సెయిలింగ్.


క్రీడాంశాలు (మహిళా అభ్యర్థులకు): అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, కయాకింగ్ అండ్ కానోయింగ్, రోయింగ్, షూటింగ్, సెయిలింగ్.


కనీస ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: స్పోర్ట్స్‌ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.


శిక్షణ: ఎంపికైనవారికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  
Secretary, 
Indian Navy Sports Control Board, 
7th Floor, Chanakya Bhavan, Naval Headquarters, 
Ministry of Defence, New Delhi.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 20.07.2024.


Notification & Application


Website


ALSO READ:


SSC CGL Recruitment: 17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 17,727 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...