ABP-Cvoter Survey: 


మోదీకే ఎక్కువ ఓట్లు..


2024 లోక్‌సభ ఎన్నికలు జరిగే ముందు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లిస్ట్‌లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. "మేరా బూత్‌ సబ్‌సే మజ్‌బూత్‌" అనే ప్రోగ్రామ్‌నీ మొదలు పెట్టారు. అయితే..మధ్యప్రదేశ్ ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి ఇప్పటికే మొదలైంది. దీనిపైనే ABP C Voter Survey ఓ ఒపినీయన్ పోల్‌ నిర్వహించింది. రకరకాల అంశాలపై అభిప్రాయాలు సేకరించిన ఈ సర్వే...ఓ ఆసక్తిర పోల్ చేపట్టింది. 2024 ఎన్నికల్లో ఎవరిని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటారు..? అని ప్రశ్నించింది. వీరిలో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ పేర్లు ప్రధానంగా ఉన్నాయి. వీరిలో ఎవరు వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా నిలబడాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు చెప్పారు ఓటర్లు. 


57% ఓట్లు మోదీకే..


ఈ సర్వేలో దాదాపు 57% మంది నరేంద్ర మోదీకే ఓటు వేశారు. ప్రధాని అభ్యర్థిగా ఆయనే తమ ఫస్ట్ ఛాయిస్ అని తేల్చి చెప్పారు. ఈ రేసులో ఉన్న రాహుల్ గాంధీకి కూడా కొంత మద్దతు లభించింది. ఆయనకు 18% మంది ఓటు వేశారు. రాహుల్ ప్రధాని అవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పీఎం రేసులో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ తరవాతి ప్రధాని ఆయనే అన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కేవలం 8% మంది మాత్రమే భావించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కి 3% మంది ఓటు వేశారు. ఇతరులకు 14% మేర ఓట్లు దక్కాయి. 


నరేంద్ర మోదీ - 57%
రాహుల్ గాంధీ - 18%
యోగి ఆదిత్యనాథ్ - 8%
కేజ్రీవాల్ - 3%
ఇతరులు - 14%


మోదీని నేరుగా ఎన్నుకుంటారట..


ఇదే ఒపీనియన్‌ పోల్‌లో మరో అంశంపైనా సర్వే జరిగింది. ఒకవేళ ప్రధానిని నేరుగా ఎన్నుకోవాల్సిన అవకాశం వస్తే ఎవరికి మొగ్గు ఎక్కువగా ఉంటుందని సర్వే నిర్వహించారు. ఇందులోనూ నరేంద్ర మోదీకే ఎక్కువ ఓట్లు దక్కాయి. దాదాపు 68% మంది ఓటర్లు "మాకు ప్రధానిని ఎన్నుకునే అవకాశం వస్తే మోదీనే ఎన్నుకుంటాం" అని తేల్చి చెప్పారు. 29% మంది రాహుల్ గాంధీ పేరు చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 3% మంది మాత్రం ఏ సమాధానమూ చెప్పలేదు. గతంలోనూ ప్రధాని అభ్యర్థిపై పలు సర్వేలు జరిగాయి. దాదాపు అన్నింట్లోనూ మోదీకే ఎక్కువ మంది మొగ్గు చూపించారు. ఈ రేసులో రెండో స్థానంలో ఉన్నారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకైతే కాంగ్రెస్..రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించలేదు. కీలక నేతలు కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ...ప్రధాని ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ రాహుల్‌ గాంధీ పేరు కూడా వినిపిస్తూ వస్తోంది. 


Also Read: Uniform Civil Code: యునిఫామ్ సివిల్‌ కోడ్ తెస్తే ముస్లింలకు ప్రమాదమా? వాళ్ల చట్టాలు పని చేయవా?