AAp MP Raghav Chadha:


రాఘవ్ చద్దాపై కాకి దాడి 


ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దాకు పార్లమెంట్ ఆవరణలో వింత అనుభవం ఎదురైంది. బయట నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా పదేపదే ఓ కాకి వచ్చి ఆయనపై దాడి చేసింది. కాలిగోళ్లతో రాఘవ్ చద్దా తలపై రక్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకి వచ్చిన ప్రతిసారీ ఆయన తల వంచి అలాగే ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సరదా సంఘటన కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఢిల్లీ బీజేపీ ఈ ఫొటోలను ట్వీట్ చేసి...రాఘవ్ చద్దాపై సెటైర్లు వేసింది. "అబద్ధాలు చెబితే కాకి పొడుస్తుందనే సామెతను ఇప్పటి వరకూ విన్నాం. ఇప్పుడది నిజమైంది" అని ట్వీట్ చేసింది. బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా దీన్ని రీట్వీట్ చేసి మరోసారి సెటైర్ వేశారు. "ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసిందన్న వార్త విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది. మీ ఆరోగ్యం బాగానే ఉందని అనుకుంటున్నాం" అని ట్వీట్ చేశారు.