Tatkal Ticket Booking: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే వ్యవస్థ. దేశంలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణీకుల కోసం రైల్వేలు వేలాది రైళ్లను నడుపుతున్నాయి. రిజర్వేషన్ పొందిన తర్వాత చాలా మంది ప్రయాణీకులు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే రిజర్వు చేసిన కోచ్‌లో ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
కానీ టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ టికెట్ మాఫీయా దీన్ని క్యాప్చర్ చేసి సామాన్యులు టికెట్ పొందకుండా చేస్తున్నాయి. ఫేక్ ఐడీలతో మొత్తాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ అంటేనే అది మన వల్ల అయ్యే పని కాదులే అని అంటున్నారు. కానీ రైల్వే వ్యవస్థ దీని సరిచేసేందుకు సిద్ధమైంది. ఐఆర్‌టీసీ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తోంది. రైల్వేలు ఇ-ఆధార్ ప్రామాణీకరణతో కొత్త వ్యవస్థను ప్రారంభించాయి. దీనితో రైలు టిక్కెట్లు చాలా సులభంగా బుక్ అవుతాయో.
ఇ-ఆధార్ ప్రామాణీకరణ ద్వారా టిక్కెట్లు బుక్ తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే వినియోగదారుల కోసం కొత్త వ్యవస్థ ప్రారంభించనున్నట్లు భారతీయ రైల్వేలు ప్రకటించింది. తత్కాల్ బుకింగ్ కోసం భారత రైల్వేలు త్వరలో ఇ-ఆధార్ ప్రామాణీకరణను అమలు చేయనున్నాయి. అంటే తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు మీ ఆధార్‌ను ధృవీకరించాలి. ప్రస్తుతం, ప్రజలు తత్కాల్ బుకింగ్ కోసం వెళ్ళినప్పుడు, వారు వెయిటింగ్ లిస్ట్‌లో మాత్రమే టిక్కెట్లను పొందుతారు. ఎందుకంటే సైట్‌లో భారీ ట్రాఫిక్ కారణంగా సైట్ ఎక్కువసేపు ఓపెన్ కావడం లేదు.
ఐఆర్‌సిటిసి ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించిన ప్రయాణీకులకు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 10 నిమిషాల్లో టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం లభిస్తుందని రైల్వే శాఖ చెబుతోంది. మరోవైపు, ఐఆర్‌సిటిసి ఏజెంట్లు ఈ ప్రారంభ 10 నిమిషాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. అంటే సాధారణ ప్రయాణీకులు తమ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించినట్లయితే టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో మరింత సౌలభ్యం పొందుతారు.
20 లక్షల ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలింది
రైల్వే మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, ఆటోమేటెడ్ సాధనాలను ఉపయోగించి టిక్కెట్లు బుక్ చేసుకునే ఏజెంట్లపై రైల్వేలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ పనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించబడుతోంది. ఇటీవలి దర్యాప్తులో, సుమారు 20 లక్షల ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, వీటిని ఆధార్ మరియు ఇతర పత్రాలతో దర్యాప్తు చేస్తున్నారు.
కానీ ఇప్పుడు IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. అలా లింక్ చేసుకున్న వాళ్లే ముందుగా బుక్ చేసుకునే అవకాశం పొందుతారు. తత్కాల్ విండో తెరిచిన తర్వాత IRCTC అధీకృత ఏజెంట్ 10 నిమిషాల వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అనుమతి ఉండు. అటువంటి పరిస్థితిలో, సాధారణ వినియోగదారులు ప్రయోజనం పొందుతారు.
బుకింగ్ సులభం అవుతుందిప్రస్తుతం, ఎవరైనా తత్కాల్ బుకింగ్ కోసం వెళ్ళినప్పుడు, యాప్ తెరిచిన వెంటనే, యాప్ లోడ్ అవ్వకపోవడం, IRCTC అధికారిక వెబ్‌సైట్ ఇబ్బంది పెట్టడం చూసే ఉంటాం. ఆ స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. మీ ఆధార్ మీ IRCTC ఖాతాకు లింక్ చేస్తే, మీరు తత్కాల్ టికెట్‌లను ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ ధృవీకరణతో మీరు సులభంగా టిక్కెట్లను బుక్ చేసుకోగలరు.
ఈ ఖాతాలకు మాత్రమే ఆధార్ లింక్రైల్వేలు టికెట్లు బుక్ చేసుకునే ఏజెంట్లను గుర్తించడం ప్రారంభించాయి. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రైల్వేలు 20 లక్షలకుపైగా అనుమానాస్పద ఖాతాలు గుర్తించాయి. ఈ ఖాతాల ఆధార్ ఇతర పత్రాలు తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 13 కోట్లకుపైగా యాక్టివ్ ఖాతాలు ఉన్నాయి. వాటిలో 1.2 కోట్ల ఖాతాలకు మాత్రమే ఆధార్ లింక్ ఉంది.