Karnataka Current Bill:


రెండు బల్బులున్న ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్‌, కంగుతిన్న గ్రామస్థులు  


కర్ణాటకలో..


కర్ణాటక ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ ఓ 90 ఏళ్ల వృద్ధురాలికి కరెంట్‌ బిల్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఉండే చిన్న గదికే రూ.1.03 లక్షల బిల్ వచ్చిందని రిసీట్‌ చేతిలో పెట్టింది. ఇది చూసి ఆమె ఒక్కరే కాదు. మొత్తం ఊరే కంగుతింది. కొప్పాల్ జిలాల్లో జరిగిందీ ఘటన. ఈ వృద్ధురాలు కొడుకుతో కలిసి ఓ చిన్న ఇంట్లో ఉంటోంది. అందులో ఉన్నది రెండే రెండు బల్బ్‌లు. కానీ బిల్‌ మాత్రం ఏదో షాపింగ్ కాంప్లెక్స్‌కి వచ్చినంత వచ్చింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..కొప్పాల్ జిల్లాలోని భాగ్యనగర్‌ గ్రామంలోని గిరిజమ్మ ఇంటికి ఇంత బిల్‌ జనరేట్ అయింది. ఆ ఇల్లు Gulbarga Electricity Supply Company Limited  పరిధిలో ఉంది. ఆ బిల్‌ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె..."ఇంత బిల్ నేనెక్కడ కట్టేది" అని వాపోతోంది. 


"నా కొడుకుతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నాను. వాడు కూలీ పని చేసుకుంటున్నాడు. ఇంత బిల్‌ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎలా కట్టాలో కూడా తెలియడం లేదు. మీ మీడియా వాళ్లే ఏదో రకంగా సాయం చేసి ఈ సమస్య నుంచి బయటపడేయండి"


- గిరిజమ్మ, బాధితురాలు


టెక్నికల్ గ్లిచ్..


ఇదే ఇంటికి గతంలో నెలకు రూ.70-80 మాత్రమే బిల్ వచ్చేది. ఇది విన్న వెంటనే అధికారులు గిరిజమ్మ ఇంటికి వచ్చారు. మీటర్‌ని చెక్ చేశారు. టెక్నికల్ సమస్య కారణంగానే ఇలా జరిగిందని తేల్చి చెప్పారు. అంత డబ్బు కట్టాల్సిన పని లేదని ఆమెకు వివరించారు. అప్పటికి ఆ ముసలావిడ మనసు శాంతించింది. 


మరో బాధితుడు..


కర్ణాటక ఉల్లాల్ కు చెందిన సదాశివ ఆచార్య అనే వ్యక్తికి ఇటీవలే కరెంట్ బిల్లు వచ్చింది. అయితే ప్రతీనెల 2 వేల నుంచి 3 వేల వరకూ బిల్లు వచ్చేంది. కానీ జూన్ నెలలో మాత్రం ఏకంగా 7 లక్షల 71 వేల 72 రూపాయలు వచ్చింది. ఇది చూసిన సదాశివ ఆచార్య ఖంగుతిన్నాడు. అది నిజంగా తన ఇంటికే వచ్చిందా అని పదే పదే చెక్ చేశాడు. తనకే వచ్చినట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు. ఎప్పుడూ వేలల్లో వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో వచ్చిందని చెప్పి వాపోయాడు. అయితే ఆ బిల్లును తీసుకొని చెక్ చేసిన అధికారులు.. బిల్లు తప్పుగా ప్రింట్ అయినట్లు గుర్తించారు. వెంటనే దాన్ని సరి చేసి రూ.2,838 బిల్లును అతడి ఇంటికి పంపారు.‘‘ఏజెన్సీల ద్వారా బిల్లుల సేకరణ జరుగుతుంది. ఈ (ఆచార్య) విద్యుత్ బిల్లు బిల్లు రీడర్ లోపం వల్ల తప్పుగా పరింట్ అయింది. కరెంటు బిల్లులో తప్పులుంటే వినియోగదారుడికి ఇవ్వము. సవరించిన బిల్లును ఆచార్యకు అందజేస్తాం.”అని ఉల్లాల్ మెస్కామ్ సబ్-డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఎ దయానాడ అన్నారు.