కేంద్ర ఉద్యోగుల నిరీక్షణకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఏడో వేతన సంఘం కింద కరవు భత్యం, ద్రవ్యోల్బణ ఉపశమనాన్ని కలిగించే నిర్ణయానికి ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే నిర్ణయం ఉంటుందని జాతీయ మీడియా చెబుతోంది. డీఏ, డీఆర్ పై ఈ నిర్ణయం మార్చి 8 తర్వాత రావచ్చని అంచనా వేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి తేదీ వెల్లడించకపోయినట్టికీ వారం పది రోజుల్లో మాత్రం గుడ్ చెబుతోందని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే ఈ అధికారిక ప్రకటన కోసం లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
ఎంత పెరుగుదల ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పెంపు జరిగితే కరవు భత్యం, ద్రవ్యోల్బణ ఉపశమనం 42 శాతానికి పెరుగుతాయి. అంటే ఉద్యోగుల జీతాలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం డీఏ 38 శాతంగా ఉంది.
జూలై నుంచి అమల్లోకి చివరి పెంపు
ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్‌ను 2022 జూలైలో 34 నుంచి 38 శాతానికి పెంచారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సమానంగా వేతనాలు పెరిగాయి. ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు ఈ పెంపు ఉంటుంది. ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఉద్యోగులకు ఈ అలవెన్స్ ఇస్తారు.
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా నిర్ణయించవచ్చు.
డీఏతోపాటు హోలీ తర్వాత ఉద్యోగుల మూలవేతనం పెంచడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల మూలవేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెంచవచ్చు.
పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకునే అవకాశం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం నుంచి పాత పెన్షన్ పథకాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ నోటిఫికేషన్ తేదీకి ముందు అంటే డిసెంబర్ 22, 2003 న ప్రకటన చేసి నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ 1972 ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ 2021 లో చేరడానికి అవకాశం ఉంది.