దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు నిర్వహించే 'కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్)-2023 దరఖాస్తు గడువును 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' పొడిగించింది. మార్చి 6తో ముగియాల్సిన గడువును మార్చి 13 వరకు పొడిగిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దరఖాస్తుకోలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.


ఫిబ్రవరి 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 13 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ విండో అందుబాటులో ఉండనుంది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే మార్చి 14 నుంచి 16 వరకు సవరించుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష తేదీని మాత్రం ఇప్పటివరకు ఎన్టీఏ ప్రకటించలేదు. త్వరలోనే పరీక్ష తేదీని వెల్లడించే అవకాశం ఉంది.


వివరాలు..


* కామ‌న్ మేనేజ్‌మెంట్‌ అడ్మిష‌న్ టెస్ట్‌(సీమ్యాట్‌)-2023


అర్హత‌: ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం చ‌దువుతున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా.


దరఖాస్తు ఫీజు..


➦ జ‌న‌ర‌ల్- బాలురకు రూ.2000, బాలికలకు రూ.1000.చే


➦ జ‌న‌ర‌ల్-EWS /ఓబీసీ(నాన్‌క్రీమిలేయ‌ర్)/ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ బాలురకు రూ.1000, బాలికలకు రూ.1000.


➦ ట్రాన్స్‌జెండ‌ర్ అభ్యర్థులకు రూ.1000.


పరీక్ష విధానం..
➥ మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 80 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 5 విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు.


➥ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు-800 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-80 మార్కులు, ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ 20 ప్రశ్నలు-80 మార్కులు ఉంటాయి.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ జవాబులు గుర్తించిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కులు ఇస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.



ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.03.2023 (05:00 P.M.) (మార్చి 13 వరకు పొడిగించారు)


➥ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 06.03.2023 (11:50 P.M.)


➥ దరఖాస్తుల సవరణ: 07.03.2023 - 09.03.2023.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: ప్రకటించాల్సి ఉంది.


➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.


➥ పరీక్ష సమయం: 180 నిమిషాలు.


➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.


Notification


Online Application


Website


                                   


Also Read:


సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష తేదీలివే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


'నిట్‌'లో ఎంసీఏ ప్రవేశానికి 'నిమ్‌సెట్', నోటిఫికేషన్ వెల్లడి!
దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్‌)లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) -2023' నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా... వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిట్-జంషెడ్‌పూర్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..