Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరంలో అపూర్వ ఘట్టం కళ్ల ముందు సాక్షాత్కరించింది. 5 ఏళ్ల బాలుని రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. బుధవారం భారీ ఊరేగింపుతో బాలరాముడు ( Ramlalla)అయోధ్య ఆలయంలోకి ప్రవేశించారు. తొలిసారి బాలరాముడుభక్తులకు అయోధ్యలో దర్శనం ఇచ్చారు. రేపు గర్భాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. బాలరాముడి దర్శనంతో భక్తులు ఆనందంతో పరవశించి పోయారు. 


అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ణకు మరో నాలుగు రోజులే మాత్రమే మిగిలి ఉంది. దేశమంతా... శ్రీరాముడి ఆలయ నిర్మాణ సంబరాల్లో మునిగితేలుతోంది. రామ నామాన్ని జపిస్తోంది. ఇప్పుడు దేశమంతటా వినిపిస్తున్న నామమొక్కటే.. అదే జై శ్రీరామ్. శతాబ్దాల నిరీక్షణ తర్వాత హైందవ జాతి ఆరాధ్యుడి ఆలయం నిర్మాణం అవుతోంది. శ్రీరాముడు పుట్టి పెరిగిన నేలపై జగదభిరాముడికి ఓ గుడి రూపుదిద్దుకుంటోంది. ఇది భారతీయ ఆత్మకు సంకేతమే కాదు... హైందవ సంస్కృతికి ప్రతిరూపం. పురాణ గాథలకు తరతరాల చరిత్రకు ప్రతిరూపంగా కడుతున్న గోపురం.