IBPS Exam Calender: ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన 2023-24 పరీక్షల క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తాజాగా విడుదల చేసింది. దీనిప్రకారం ఐబీపీఎస్ ఈ ఏడాది గ్రామీణ బ్యాంకుల్లో(RRB) ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులను; అదేవిధంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయంది. 

ప్రకటించిన ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం..

➥ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్(స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష; ఆఫీసర్ స్కేల్-1 మెయిన్ పరీక్ష సెప్టెంబరు 29న, ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను అక్టోబరు 6న ఐబీపీఎస్ నిర్వహించనుంది. అదేవిధంగా ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-2, 3 సింగిల్ పరీక్షను సెప్టెంబరు 29న నిర్వహించనుంది. 

➥ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 24, 25;, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 13న మెయిన్ పరీక్ష ఉండనుంది.

➥ ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అక్టోబరు 19, 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 30న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

➥ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నంబరు 9న ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరు 14న మెయిన్ పరీక్షలను ఐబీపీఎస్  నిర్వహించనుంది. 

పరీక్ష పేరు  తేదీలు
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ 03.08.2024, 04.08.2024, 10.08.2024, 17.08.2024 & 18.08.2024
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్ 29.09.2024 
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ 29.09.2024
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ 06.10.2024
 ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 24.08.2024, 25.08.2024, 31.08.2024
 ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ 13.10.2024
 ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ 19.10.2024, 20.10.2024
 ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 30.11.2024
 ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ 09.11.2024
 ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 14.12.2024

ALSO READ:

IBPS CBO: ఎస్‌బీఐ సీబీవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(CBO) రాతపరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు జనవరి 16న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/ రూల్ నెంబరు లేదా పాస్‌వర్డ్/ పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జనవరి 21న ఆన్‌లైన్ ఆధారిత రాతపరీక్ష (CBT) నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ శాఖలలో సీబీవో పోస్టుల భర్తీకి నవంబరు 22న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5,447 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలు ఉన్నాయి. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...