న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మాజీ అండర్ సెక్రటరీ రామస్వామి వెంకట సుబ్రమణి హిందూ ఉగ్రవాదం,  26/11 ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏఎన్ఐ కి ఇచ్చిన తన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను హోం శాఖలో పనిచేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనను హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను వెతకాలని కోరారని ఆయన చెప్పారు. దేశంలో అలాంటి కేసులేవీ లేవని తనకు చెప్పినట్లు పేర్కొన్నారు.

Continues below advertisement

హిందూ ఉగ్రవాదం ఫైల్స్ కోసం సెర్చ్ చేశాం.. 

స్మితా ప్రకాష్ ఓ పాడ్‌కాస్ట్‌లో ఆర్‌వీఎస్ మణి మాట్లాడుతూ.. ‘2010 వరకు ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్‌లో ఉన్నప్పుడు, ఏ ఫైల్‌లోనూ హిందూ ఉగ్రవాదం అనే పదం లేదు. జూన్ 2006లో హిందూ ఉగ్రవాదం కేసుల సమాచారాన్ని సేకరించాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. ఇప్పటివరకూ అలాంటి కేసులేవీ లేవని ఆయనకు చెప్పాను. మాలెగావ్ కేసు.. మొదటి రోజు నుంచే ఇది ఒక అబద్ధపు కేసు అని చెబుతూ వచ్చాను. ముందే రాసిన స్క్రిప్ట్ లాగా అనిపించింది. దాని ప్రకారమే సాధ్వి ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్, మేజర్ ఉపాధ్యాయ్ లాంటి వారు పని చేశారు. 

Continues below advertisement

 కల్నల్ పురోహిత్ నేడు జైలు బయట ఉండటం అద్భుతం అని చెప్పాలి. ఆయన అరెస్ట్ అనుకోకుండా చేసింది కాదు. దాని వెనుక ఒక కుట్ర దాగి ఉంది. 34 ఏళ్ల వయసులో ఆయన సెలెక్షన్ గ్రేడ్ లెఫ్టినెంట్ కల్నల్ కాగా, ఆయన ఆర్మీ చీఫ్ కాకున్నా.. కనీసం కోర్ కమాండర్ అయితే ఖచ్చితంగా అయ్యేవారు. ఆ స్థాయికి చేరుకోవడం పాకిస్తాన్ ప్రజలకు ఇష్టం లేదని’ అన్నారు.

ముంబై ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలుముంబైలో జరిగిన 26/11 దాడిని సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దాడితో పోల్చడంపై ఆర్‌వీఎస్ మణి స్పందించారు. ‘ఇది కాంగ్రెస్ పార్టీ, ISI ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల భారత్‌లో రాజకీయ నేతలకు ఏం లాభం చేకూరుతుంది? అంటే.. దీనిని కేవలం ఒక హిందూ దాడిగా చూపించడమే దాని ఉద్దేశం. కసబ్ చేతికి కూడా రక్షాబంధనం కట్టి ఉంచారు. ఒకవేళ తుకారాం ఓంబ్లే అతడిని పట్టుకోకపోయినా లేదా చంపకపోయినా, ఈ రోజు హిందూ ఉగ్రవాద దాడిగానే పరిగణించేవారు’అని సంచలన విషయాలు చెప్పారు.

Also Read: One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!

‘నా సీనియర్ అధికారులు ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసును రాజకీయ నాయకులు హత్య కేసుగా మార్చేశారు. నాకు సరిగ్గా గుర్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రమే లక్ష్యంగా ఉన్నారని’ మరోవైపు ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుపై వ్యాఖ్యానించారు. బియాంత్ సింగ్ హత్య కేసులో తాను భారత ప్రభుత్వానికి ఏకైక సాక్షినని తెలిపారు. జాతీయ భద్రత పరంగా ముఖ్యమైన అంశం ఏంటంటే.. ప్రధాని మోదీ వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. కానీ సురక్షిత భారత్ అని కూడా ప్రకటించాలని’ తాను భావిస్తున్నట్లు ఆర్‌వీఎస్ మణి పేర్కొన్నారు.