'Super Naani' wins gold :  నలభై ఏళ్లకు మోకాళ్ల నొప్పులు.. అరవై ఏళ్లకు కాస్త స్థిరంగా నడవలేని జనరేషన్ వచ్చేసింది. కానీ ఇప్పటికే పెద్దయిపోయిన వాళ్లు మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. ఎంత స్ట్రాంగ్ అంటే 105 ఏళ్ల వయసులో పరుగులు పందెంలో పాల్గొని పతకం గెల్చుకునేంత. అది కూడా తన వయసు వాళ్లతో కాదు.. తన కంటే 30 ఏళ్లు చిన్న వాళ్లతో పోటీ పడి మరీ గోల్డ్ కొట్టేసింది ఆ సూపర్ బామ్మ. 





 గుజరాత్ చెందిన  రాంబాయికి 105 ఏళ్లు. అయితే ఆమె ఇప్పటికీ యాక్టివ్‌గా ఉంటారు. మనలో చాలా మంది అలా ఉంటారని అనుకుంటాం కానీ.. ఆమె తన యాక్టివ్ నెస్ గురించి అందరికీ తెలిసేలా చేసింది.  105 ఏళ్ల వయసులో స్ప్రింట్‌ క్వీన్‌గా అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వడోదరలో ఇటీవల  న తొలి జాతీయ ఓపెన్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ జరిగాయి. అంటే.. పెద్ద వాళ్లకు పోటీలు అన్నమాట. 





 ఈ పోటీల్లో  100 మీ. రేస్‌లో హరియాణాకు చెందిన రాంబాయి 45.40 సెకన్ల రికార్డు టైమింగ్‌తో స్వర్ణం సాధించారు. 85 ఏళ్లకు పైబడిన విభాగంలో ఈ రేస్‌ నిర్వహించగా.. ఆమెకు పోటీనిచ్చే వారే లేకపోయారు. సింగిల్‌గా రేసు ఆరంభం నుండి రాంబాయి నిలకడగా పరిగెత్తి గమ్యస్థానాన్ని చేరుకోవడంతో స్వర్ణం సాధించారు. ఈ క్రమంలో మాస్టర్స్‌లో విభాగంలో మన్‌ కౌర్‌ పేరిట ఉన్న  74 సెకన్లు  జాతీయ రికార్డును రాంబాయి అధిగమించారు.


రాంబాయి పరుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఔరా బామ్మ అని అందరూ అభినందిస్తున్నారు.