KA Paul Meets CBI Director: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్ తదితరులపై తాను సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ వెల్లడించారు. దాన్ని ఎలా ఇన్వేస్టిగేషన్ చేసే అంశంపై తామిద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు. సమావేశం ముగిశాక ఆయనపై చెయ్యి వేసి, ప్రార్థించి దీవించానని చెప్పారు. బుధవారం ఢిల్లీలో కేఏ పాల్ సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ ను కలిశారు. కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, వారిపై రాతపూర్వకంగా సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.


కేసీఆర్ కుటుంబం అక్రమాల గురించి తన వద్ద సమాచారం ఉందని సీబీఐ డైరెక్టర్ అన్నారని కేఏ పాల్ చెప్పారు. కానీ, ఇంతకుముందు ఎవరూ సరైన కంప్టైంట్ ఇవ్వలేదని, ఇప్పుడు తాను ఫిర్యాదు చేసినందుకు అభినందనలు తెలిపారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, యాదగిరి గుట్ట ప్రాజెక్టుల విషయంలోనూ అక్రమాలు జరిగాయని కేఏ పాల్ ఆరోపించారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు మీద రూ.లక్షా ఐదు వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ డైరెక్టర్ కి చెప్తే ఆయన కూడా ఆ విషయం తనకు తెలుసని ఆయన అన్నారని చెప్పారు. తనపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 


నేను చెప్పినట్లే ద్రౌపది ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు - పాల్
రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడంపై కూడా కేఏ పాల్ స్పందించారు. ‘‘నేను చెప్పిన వ్యక్తినే ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. నా సహోదరి అయిన ఒడియా బిడ్డ ద్రౌపది ముర్మూను అభ్యర్థిని చేస్తారని నేను ముందే చెప్పాను. కొద్ది రోజుల క్రితమే నేను హింట్ ఇచ్చాను. వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిని చేయొద్దని ఆనాడే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినట్లే గిరిజన బిడ్డ అయిన ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిని చేశారు’’ అని కేఏ పాల్ అన్నారు.


రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడిని చేయవద్దు నేను సూచించాను. నేను మొదటినుంచి షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి ఇవ్వాలని బీజేపీకి చెప్పాను. ఒడిశాలోని ఓ షెడ్యూల్ కులానికి చెందిన ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం సంతోషం’’ అని పేర్కొన్నారు.