PAKISTAN BID TO ESCALATE NEGATED: ఆపరేషన్ సిందూర్ లో తాము పూర్తిగా ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేశామని పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేని భారత సైన్యం విస్పష్టంగా ప్రకటించింది. అదే సమయంలో భారత సైనిక స్థావరాలపై ఏదైనా దాడి జరిగితే ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నామని సైన్యం ప్రకటించింది. అయితే పాకిస్తాన్ దుస్సాహాసానికి ప్రయత్నించింది.
భారత్ లోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాలాయ్ , భుజ్‌లతో సహా అనేక సైనిక వ్యవస్థలపై డ్రోన్‌లు , క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్ , ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు అడ్డుకున్నాయి. కూల్చివేశాయి. వీటి శిథిలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరించారు. పాకిస్తాన్ దాడులు చేసిందనేందుకు ఇవన్నీ సాక్ష్యాలు.
అయితే భారత్ రివర్స్ లో పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ చేసిన దుస్సాహసానికి ప్రతిగా భారత ప్రతిస్పందన ఉంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్ , రాజౌరి రంగాలలోని ప్రాంతాలలో పాకిస్తాన్ మోర్టార్లు , భారీ క్యాలిబర్ ఆర్టిలరీలను ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగుతోంది. పాకిస్తాన్ కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా పదహారు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా, పాకిస్తాన్ నుండి మోర్టార్ , ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారతదేశం స్పందించవలసి వచ్చింది. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు తమ వైపు నుంచి ఖచ్చితంగా సమాధానం ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్ లో ఈ ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్ ఆర్థిక కేంద్రమైన కరాచీలో, లాహోర్‌లో గురువారం పేలుళ్లు సంభవించాయి. లాహోర్‌లోని వాల్టన్ రోడ్డులోని సైనిక విమానాశ్రయం సమీపంలో భారీ శబ్ధంతో పేలుళ్లు సంభవించాయి. లాహోర్‌లోని అస్కరి 5 సమీపంలో ఈ ఉదయం రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. వాల్టన్ ఎయిర్ పోర్టులో నసీరాబాద్, గోపాల్ నగర్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించడంతో ఎయిర్ సైరన్ల మోత మోగింది. పేలుళ్లు అనంతరం ప్రజలు భయాందోళకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ దాడులకు పాల్పడింది భారతేనని తాజాగా తేలింది. లాహోర్, కరాచీ, గుజ్రన్‌వాలా సహా పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. కిస్తాన్ లోని పలు నగరాలు లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు డ్రోన్ దాడులు చేపట్టాయని చెప్పింది. అయితే ఇదంతా తమ జోలికి వచ్చిన కారణంగానే జరుగుతున్నాయని భార్త గట్టిగా బదులిచ్చింది. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే టార్గెట్లు చాలా ఎక్కువగా ఉంటాయన్న సంకేతాలను భారత్ పంపింది.