Operation Sindoor: భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. భారత్‌ను ధైర్యంగా దెబ్బకొట్టామని చెప్పుకునేందుకు ఫేక్ ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేస్తోంది. మరోవైపు భారత సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొని ఫైటర్ జెట్లను, క్షిపణులను విజయవంతంగా పేల్చివేశామని పాక్ కట్టు కథలు చెప్పి ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలు అవుతోంది. అయినా పాకిస్తాన్ వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు.

పహల్గాం దాడి నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు నిజాయితీగా, పాదర్శకంగా కథనాలు ఇస్తున్న ఏబీపీ న్యూస్ పై పాకిస్తాన్ నిషేధం విధించింది. పాక్ చేస్తున్న దుష్ప్రచారంతో పాటు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, కథనాలు యథాతథంగా రిపోర్ట్ చేస్తున్న ఏబీపీ న్యూస్ ఫేస్‌బుక్ పేజీని పాకిస్తాన్ బ్లాక్ చేయించింది. పాకిస్థాన్‌లో ఏబీపీ న్యూస్ ఫేస్ బుక్ పేజీని అక్కడి ప్రజలు చూడకుండా బ్లాక్ చేసింది.

ఏబీపీ న్యూస్ మే 2న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం గురించి 2 కథనాలను పోస్ట్ చేసింది. ఆ కథనంలో సైన్యం యుద్ధ విమానాల గురించి ఉంది. వాయుసేన తన యుద్ధ విమానాలను గంగా ఎక్స్‌ప్రెస్‌వేలో   సిద్ధంగా ఉంచి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యొక్క ఈ శక్తి ప్రదర్శన పాకిస్థాన్‌ను మరింత ఒత్తిడికి గురిచేసింది.  ఏబీపీ న్యూస్ ఈ వార్తను చాలా సరిగ్గా ప్రదర్శించింది. మరో కథనంలో ఎయిర్ స్టైక్స్ గురించి రిపోర్ట్ చేసింది. దాంతో పాకిస్థాన్ ఈ రెండు పోస్ట్‌లను ముందుగా బ్లాక్ చేయించింది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఏపీబీ ఫేస్‌బుక్ పేజీని కూడా బ్లాక్ చేయించింది.

ఏబీపీ న్యూస్ వార్తకు భయపడిన పాకిస్థాన్ 

పాకిస్థాన్ వక్రబుద్ధి మారలేదు. ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ దాడులు చేయడం అనవాయితీగా చేసుకుంది. తాము ఉగ్రవాదుల వల్ల నష్టపోయాం అంటూనే.. ఓ పాక్ మంత్రి తాము టెర్రరిస్టులకు ఫండింగ్ చేశామంటారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాతి నుంచి ఆపరేషన్ సింధూర్‌ వరకు ఏపీబీ న్యూస్ తన నిజాయితీని ప్రదర్శించింది. జాతీయ భద్రత, దేశ సమగ్రతను చాటేలా కథనాలు ప్రచురించడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఏబీపీ న్యూస్ నిజాలకు భయపడి పేజీని బ్లాక్ చేపించింది. 

భారతదేశం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది

భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాటాక చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ లో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసింది. దీనిలో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ సైన్యం సిబ్బంది మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. పాకిస్థాన్ ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తూ వచ్చినట్లు నటిస్తూనే ప్రపంచానికి అడ్డంగా దొరికపోయింది. .