Nag Mk 2 Missile : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసిన మూడవ తరం ఫైర్ అండ్ ఫర్‌గెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (Nag Mk2 anti-tank guided missile - ATGM)నాగ్ మార్క్ 2 ఫీల్డ్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ట్రయల్స్ ను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ రేంజ్‌లో నిర్వహించారు. ఇక్కడ క్షిపణి అసాధారణమైన కచ్చితత్వం, విశ్వసనీయతను ప్రదర్శించింది. రక్షణ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, గరిష్ట, కనిష్ట పరిధి పరిమితుల వద్ద నిర్దేశించిన అన్ని లక్ష్యాలను చేరుకోవడంతో దీని పరిధి సైతం నిర్థారించారు. ఈ క్షిపణికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్య లక్షణాలు
అధునాతన సాంకేతికత
- మూడవ తరం ఫైర్ అండ్ ఫర్‌గెట్ ATGM.
- లాంచ్‌కు ముందు టార్గెట్ లాకింగ్ కోసం అధునాతన ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీని ఉపయోగించారు.
- అన్ని వాతావరణ పరిస్థితులు, సంక్లిష్టమైన యుద్దభూమి వాతావరణంలో పనిచేయగల సామర్థ్యం దీనికుంది.
స్పెసిఫికేషన్లు
వేగం: సెకనుకు 230 మీటర్లు.
పరిధి : 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను 17-18 సెకన్లలో ధ్వంసం చేయగలదు.
బరువు: సుమారు 45 కిలోగ్రాములు.
పొడవు : 6 అడుగుల 1 అంగుళం.
సామర్థ్యాలు
- ఎక్స్ ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ (explosive reactive armor - ERA)తో కూడిన ట్యాంకులతో సహా ఆధునిక సాయుధ బెదిరింపులను తటస్థం చేయడానికి దీన్ని రూపొందించారు.
- కచ్చితమైన సామర్ధ్యం కచ్చితమైన ప్రయోగాన్ని నిర్ధారిస్తుంది.
అభివృద్ధి, ఖర్చు
- డీఆర్డీవో ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని అభివృద్ధి చేశారు.
- 2017-2019 ట్రయల్స్‌లో అడ్వాన్స్‌మెంట్‌లతో కూడిన 1990లో నిర్వహించిన ప్రారంభ పరీక్ష విజయవంతమైంది.
నాగ్‌మార్క్-2 గురించి మరిన్ని విషయాలు
సరిహద్దుకు ఆవల దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనాకు కళ్లెం వేసేందుకు నాగ్‌మార్క్-2 క్షిపణి ఎంతో ఉపయోగపడనుంది. మరీ ముఖ్యంగా అరుణాచల్ భూభాగంలోకి చొచ్చుకొస్తున్న చైనాను అడ్డుకునేందుకు ఈ తరహా ప్రయోగాలు భవిష్యత్తులోనూ మంచి ఫలితాలనిస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నాగ్‌మార్క్-2(Nag Mark -2) భారత సైన్యానికి బహుముఖ ఆయుధ వ్యవస్థలాంటిందని అంటున్నారు. యుద్ధక్షేత్రంలోకి దీన్ని తీసుకెళ్లడం, ప్రయోగించడం కూడా అత్యంత సలుభతరమని రక్షణ శాఖ అధికారులు సైతం తెలిపారు. దీన్ని భారత సైన్యంలో చేర్చడానికి సిద్దంగా ఉన్నట్టు డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. ఈ క్షిపణి పని తీరుపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న సిబ్బందితో పాటు DRDO, భారత సైన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఆయుదాల ఎగుమతిలో టాప్ 25లో భారత్
స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, 2019 నుంచి 2023వరకు జరిగిన ప్రపంచ ఆయుధ కొనుగోళ్లలో భారత్ 36శాతం వాటాని కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల కొనుగోలుదారుగా కొనసాగుతోన్న భారత్.. ఆయుధాలు ఎగుమతి చేసే టాప్ 25 దేశాల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది దేశ రక్షణ ఎగుమతులు రికార్డ్ స్థాయిలో 200 బిలియన్లకు చేరుకున్నాయని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు.
Also Read : PM Modi: నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ