Pakistan Bans Indian Shows:


ఆ షోలు ఆపేయాల్సిందే..


ఇండియన్‌ టీవీ షోలు, సినిమాలంటే పాకిస్థాన్‌ ప్రజలకూ ఇంట్రెస్టే. ఏవీ వదలకుండా చూసేస్తారు. చెప్పాలంటే...వీటన్నింటికీ అక్కడి ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. ఇదే పాక్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇండియన్ షోస్‌ని ఎందుకు చూస్తున్నారంటూ పదేపదే వారిస్తోంది. అయినా ప్రజలు పట్టించుకోలేదు. ఇలాగైతే కుదరదనుకున్న ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాక్‌లోని కేబుల్ ఆపరేటర్‌లు ఇండియన్ కంటెంట్‌ని చూపించకుండా బ్యాన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఓ ఉద్యమమే చేస్తోంది. ఏ కేబుల్ ఆపరేటర్‌ కూడా ఇండియన్ టీవీ షోని కానీ, సినిమాని కానీ చూపించడానికి వీల్లేదని తేల్చి చెబుతోంది. పాకిస్థాన్ న్యూస్‌ పేపర్ "Dawn" ప్రకారం...పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) టీవీ ఆపరేటర్లకు ప్రభుత్వం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఇండియన్ కంటెంట్ ప్రసారాన్ని ఇప్పటికిప్పుడు ఆపేయాలని హెచ్చరించింది. ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.






ఆకస్మిక తనిఖీలు 


PEMRA నుంచి అనుమతి పొందిన వాళ్లు మాత్రమే ఏ ఛానల్‌ని అయినా ప్రసారం చేయాలని తేల్చి చెప్పింది. ఇప్పటికే కొందరు ఆపరేటర్‌లు ఈ రూల్స్‌ని అతిక్రమించి మరీ ఇండియన్ కంటెంట్‌ని ప్రసారం చేస్తున్నాయి. అధికారులు రెయిడ్స్ నిర్వహించి వీరిపై చర్యలు తీసుకుంటున్నారు. పాక్ సుప్రీం కోర్టు కూడా ఆపరేటర్స్‌కి వార్నింగ్ ఇచ్చింది. కరాచీలోని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  Digital Cable Network, Home Media Communications (Pvt.) Ltd, Shahzeb Cable Network ఆపరేటర్ల ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌ ప్రావిన్స్‌లోనూ పలు చోట్ల రెయిడ్స్ జరిగాయి. 


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇండియా అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని పొగిడారు. రష్యా నుంచి చీప్‌ క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేయడం సాధారణ విషయం కాదని, భారత్ ఇది సాధించిందని అన్నారు. దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేసిన ఆయన...తన హయాంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు వివరించారు. కానీ అనుకోకుండా తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల అది కుదరలేదని అసహనం వ్యక్తం చేశారు. 


"భారత్‌ లాగే పాకిస్థాన్ కూడా రష్యా నుంచి చీప్ క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేయాల్సింది. నా హయాంలో ఈ ప్రయత్నం జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఉన్నట్టుండి మా గవర్నమెంట్ కూలిపోయింది. అందుకే ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయాం. ప్రస్తుతం మా దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. కనీసం ఇప్పుడైనా రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడాయిల్‌ను కొనుగోలు చేయొచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయలేకపోతోంది"


- ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ ప్రధాని


Also Read: IIT Madras: ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య,తనతో ఎవరూ మాట్లాడడం లేదంటూ నోట్