ఓవైపు అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరుగుతుంటే మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఉత్సాహంగా ఉన్నారు. అయితే తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారత్ తో సంబంధాలు ఎలా ఉంటాయి? భారత్ తో తిరిగి అదే స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను తాలిబన్లు కొనసాగిస్తారా? ఈ ప్రశ్నలకు తాలిబన్ సీనియర్ లీడర్ షేర్ మహ్మద్ అబ్బాస్ తానేక్ జాయ్ సమాధానమిచ్చారు.
భారత్ తో వాణిజ్య, ఆర్థిక, రాజకీయ సంబంధాలను కొనసాగించాలని తాము ఆశిస్తున్నట్లు అబ్బాస్ అన్నారు. ఈ ప్రాంతంలో భారత్ ను ఓ ముఖ్యదేశంగా అభివర్ణించారు.
Also Read: Pocso Case: యువతిపై పోక్సో కేసు నమోదు... మైనర్ తో ఆ పనిచేసినందుకే... రిమాండ్ విధించిన కోర్టు
పాకిస్థాన్ కీలకం..
భారత్- అఫ్గానిస్థాన్ వాణిజ్య సంబంధాల్లో పాకిస్థాన్ పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఎగుమతులు, దిగుమతులు పాకిస్థాన్ మీదుగానే వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు తాలిబన్ సోషల్ మీడియా ఖాతాల్లో ఆయన 46 నిమిషాల వీడియోను పెట్టారు. ఇప్పటివరకు ఇతర దేశాలతో సంబంధాలపై తాలిబన్లు స్పందించలేదు.
ప్రభుత్వ ఏర్పాటుపై..
ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు కోసం వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలతో చర్చిస్తున్నట్లు అబ్బాస్ అన్నారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకుపోతుందని ఆయన అన్నారు.
చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, రష్యాతోనూ మంచి సంబంధాలను కోరుకుంటున్నామన్నారు. మిలియన్ల మంది అఫ్గాన్ శరణాగతులకు ఆశ్రయం కల్పించినందుకు పాకిస్థాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ తో సోదర సంబంధాలను అఫ్గాన్ కోరుకుంటుందన్నారు.
ఉద్రిక్త పరిస్థితులు..
ప్రస్తుతం కాబూల్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టు పై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు ఉదయం కాబూల్ విమానాశ్రయంపైకి ఐదు రాకెట్లు దూసుకొచ్చాయి. అయితే క్షిపణి రక్షణ వ్యవస్థా వాటిని కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ దాడులను అమెరికా కూడా ధ్రువీకరించింది.
Also Read: Afganisthan Crisis Update: కాబూల్ విమానాశ్రయంపై రాకెట్ల వర్షం.. 'డెడ్ లైన్'కు ముందు ఉద్రిక్తత