Saviors in Uniform :  కిరణ్ బేడీ గురించి ఈ తరంలోనూ తెలియని వాళ్లు తక్కువ మందే. ఎందుకంటే బ్రేవ్ ఆఫీసర్లలో ఆమె చరిత్ర ప్రత్యేకమైనది. 16-07-1972న భారత పోలీస్‌ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీక రించింది. అమృత్‌సర్‌కు చెందిన డా కిరణ్‌ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన కిరణ్‌ బేడి ఢిల్లీ ఐఐటీ సోషల్‌ సైన్సెస్‌ విభాగం నుండి డాక్టరేట్‌ కూడ అందుకున్నారు. 


దేశంలో తొలి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ 


1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్‌ సర్వీస్‌లోకి వచ్చిన కిరణ్‌ బేడి మొదటి సారిగా  ఢిల్లీ డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌)గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహించారు. 9 వేల మంది ఖైదీలున్న తీహార్‌ జైలు కు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది. ఎన్నో సంస్కరణలు చేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా 1994లో రామన్‌ మెగసెసె అవార్డు లభించింది. ఐక్యరా జ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్‌ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్‌ బేడీ నే . ‘ఐ డేర్‌’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్‌ బేడీ.


తీహార్ జైలులో ఎన్నో సంస్కరణలు - మొగసెసె అవార్డు 


నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా ఆమె జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్‌ జైలు ఇప్పుడు కొంచెం మానవత్వంతో ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్‌లో శుభ్రత ఉండేది కాదు.  ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా, యాంటీ టెర్రరిస్ట్‌ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ ఉక్కుపాదం మోపారు. 


పలు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు


ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసె అవార్డు పొందినది.


స్వచ్చంద సంస్థలు... రచనలతో యువతలో స్ఫూర్తి 


1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ పి యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు.ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.1982లో ప్రధాని ఇందిరాగాంధి కారుని ప్రవేశంలేని చోట ఆపివుంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీసివేయించింది. ఆ సమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు.1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు. కిరణ్‌ బేడీ తన ఆత్మకథ ‘ఐ డేర్‌’ పేరుతో తనే రాారు.  1975 రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మొత్తం పురుషులే ఉన్న ఢిల్లీ పోలీస్‌ దళాన్ని కిరణ్‌ బేడీ ముందుండి నడిపించారు. ఇలాంటి ఎన్నో గొప్ప సందర్భాలు ఆమె జీవితంలో ఉన్నాయి.