Thief Steals Money From A Temple And Keeps It In A School :  కర్ణాటకలో ఉడుపి సమీపంలో హెమ్మడి అనే గ్రామం ఉంది. అన్ని గ్రామాల్లోగే అక్కడ గుడి ఉంది.. బడి ఉంది. లక్ష్మినరసింహ స్వామి గుడిలో జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో హుండీని ఎవరూ పట్టించుకోవడం లేదని ఓ దొంగ పగులగొట్టి అందులో ఉన్న డబ్బులన్నీ దోచుకుపోయాడు. విషయం తెలిసుకున్న పూజారి కంగారు పడుతున్న సమయంలో ఊళ్లో ఉన్న గుళ్లో రెండో అంతస్తులో.. ఆలయానికి సంబంధించిన సంచిలో డబ్బులున్నాయన్న విషయం తెలిసింది. ఉదయమే స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఆ సంచిని గుర్తించి టీచర్లకు సమాచారం ఇచ్చారు. టీచర్లు ఊరి పెద్దలకు తెలియచేశారు. అప్పుడే గుడిలోనూ చోరీ జరిగిందని తెలియడంతో ఆ డబ్బే అయి ఉంటుందని గుర్తించారు.                                       

  


ట్రాఫిక్‌లో డబ్బులు వెదజల్లి వీడియో - హైదరాబాద్‌లో యూట్యూబర్ అరాచకం - పట్టించుకోని పోలీసులు


పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దొంగతనం జరిగిన గుడిని.. డబ్బులు వదిలేసిన బడిని పరిశీలించారు. అయితే ఆ దొంగ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ హుండీలో ఉండాల్సిన మొత్తం కన్నా.. చాలా తక్కువ సంచిలో ఉంచాడు. అంతే కాదు.. ఆలయంలోని హుండీతో పాటు మరో మూడు ఇళ్లల్లోనూ చోరీ చేశాడు. ఆ చోరీ చేసిన డబ్బుల్ని ఎక్కడా పడేయలేదు. దీంతో ఆ దొంగ ఉద్దేశపూర్వకంగా పడేసి ఉండవరని అంచనా వేస్తున్నారు.                   


అయితే దొంగ ఇళ్లల్లో దొంగతనం చేసినా భయపడలేదు కానీ.. గుడిలో హుండీలో నగదు దొంగతనం చేయడం వల్ల .. దేవుడికి భయపడి ఉంటారని .. అందకే డబ్బుల్ని బడిలో వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. మిగతా మొత్తాన్ని ఇంకెక్కడైనా వదిలేసి ఉంటారని  వెదికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని  స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పరిశీలిస్తే.. ఓ వక్తి మొహం కనిపించకుండా వచ్చి దొంగతనం చేసినట్లుగా గర్తించారు. స్పిప్పర్స్ వేసుకుని ఉన్నాడు.. అలాగే గుడిలో వచ్చాడు.. కానీ దొంగతనం చేసే ముందే దేవడికి దండం పెట్టుకున్నాడు. చోరీ జరిగిన మిగతా మూడు ఇళ్లలో ఎంతెంత పోయిందో పోలీసులు బయట పెట్టలేదు.           


టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!


అయితే ఆ దొంగ అందరికీ తెలిసిన ఆ ఊరి వ్యక్తే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఊరిలోని అనుమానితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా గుడిలో కొట్టిన నగదును బడిలో వదిలేయడంతో..  అందరూ ఏదో సందేశం ఉందనుకున్నారు. కానీ  దొంగ..  అలవాట్లో పొరపాటుగా.. వదిలేసిపోయి ఉంటాడని అంతిమంగా తేల్చుకున్నారు.