Odisha Vigilance caught IAS officer: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా నేరుగా లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్నరాు. ఆదివారం సాయంత్రం ఒడిషాలోని కలహండి జిల్లాలో ఒక వ్యాపారవేత్త నుండి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఒక IAS అధికారిని అధికారులు పట్టుకున్నారు.
2021 బ్యాచ్‌కు చెందిన ధీమన్ చక్మా ప్రస్తుతం కలహండి జిల్లాలోని ధరమ్‌గఢ్‌లో సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు . చక్మా ఒక వ్యాపారవేత్త నుండి మొత్తం 20 లక్షల రూపాయల డిమాండ్ చేశాడు. భాగంగా 10 లక్షల రూపాయలను లంచంగా తీసుకున్నాడు. వ్యాపారవేత్త లంచం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. వ్యాపారవేత్త విజిలెన్స్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశాడు.
వ్యాపారవేత్తని IAS అధికారి తన అధికారిక ప్రభుత్వ నివాసానికి పిలిచి మరీ లంచం మొత్తాన్ని స్వీకరించాడు. వివిధ డినామినేషన్‌ల నోట్ల బండిల్‌లను తన రెండు చేతులతో పరిశీలించి వాటిని తన నివాసంలోని ఆఫీస్ టేబుల్ డ్రాయర్‌లో ఉంచాడు.అప్పుడే విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు దాడి చేసినప్పుడు చేసే టెస్టులు చేసి.. అతనే డబ్బులు తీసుకున్నాడని నిర్దారించారు. తర్వాత సోదాల్లో అతని అధికారిక నివాసంలో మరో 47 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి .
చక్మా త్రిపురాలోని కాంచన్‌పూర్‌కు చెందిన వ్యక్తి. అగర్తలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుండి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అతను, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరాడు.
అధికారిక నివాసంలోనే నేరుగా లంచం తీసుకునేంత ధైర్యం చేశాడంటే.. ఐఏఎస్‌గా ఉన్న తనను ఎవరూ పట్టుకోలేరని అనుకున్నారని భావిస్తున్నారు.