History Behind Walls Have Ears Idiom: 


గోడలకు చెవులుంటాయ్ జాగ్రత్త..


ఆ ఇద్దరు ఎంప్లాయిస్‌ బాస్‌పై కాస్త కోపంగా ఉన్నారు. ఏ విషయంలోనూ తమకు సపోర్ట్ చేయటం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. అందరూ వెళ్లిపోయాక ఆఫీస్ క్యాంటీన్‌లో ఇద్దరే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒకరు మాట్లాడటం మొదలెట్టగానే..మరో వ్యక్తి "ష్...కాస్త చిన్నగా మాట్లాడు. గోడలకు కూడా చెవులుంటాయ్" అని వారించాడు. ఇలాంటి సందర్భమే కాకపోయినా...మన లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్‌ని మనం తప్పకుండా ఎదుర్కొనే ఉంటాం. గోడలకు చెవులుంటాయ్ అనే మాట తరచుగా వింటూనే ఉంటాం. ముఖ్యంగా మన ముందు తరం వాళ్లు ఈ మాటను ఎక్కువగా వాడేవారు. అసలు ఈ మాట ఎందుకు పుట్టింది..? దీని మూలాలు ఎక్కడున్నాయి..? ఇంతలా ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది..? ఈ ఇంట్రెంస్టింగ్ విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? ఒకవేళ ఇలా బుర్రబద్దలు కొట్టుకుని ఉంటే...ఇక ఆ పని మానేయండి. ఎందుకంటే...ఈ డిటెయిల్స్ గురించి ఇప్పుడు మేం చెప్పబోతున్నాం కనుక. 


ఇంగ్లీష్ సామెత నుంచి..


"గోడలకు చెవులుంటాయ్" అనే సామెతకు మూలం ఇంగ్లీష్‌లోని ఇడియమ్. "Walls have ears" అనే ఇంగ్లీష్‌ సామెత...తెలుగులో అలా మారిందన్నమాట. మరి ఇంగ్లీష్‌లో అయినా సరే ఈ మాట ఎందుకు పుట్టింది అంటే...ఓసారి చరిత్రలోకి వెళ్లాలి. ఇటలీలోని Syracuse సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 405-367 మధ్య కాలంలో డియోనిసియస్ (Dionysius)అనే కింగ్ పరిపాలించారు. ఆ సమయంలోనే తన కోటకు వెనక భాగంలోనే అండర్‌గ్రౌండ్‌లో ఓ పెద్ద ఛాంబర్ నిర్మించుకున్నాడు. దాని పేరే "Dionysius Ear".ఈ ఛాంబర్ పైన 72 అడుగుల వరకూ ఎవరు ఏం మాట్లాడినా ఆ ఛాంబర్‌లోకి వినిపించే టెక్నాలజీని అప్పట్లో వినియోగించారు. పక్కన ఉంటూనే వెన్నుపోటు పొడిచేందుకు
ప్రయత్నించే వారిని గుర్తించేందుకు ఇలాంటి సీక్రెట్ ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి  Dionysius Ear అనే పేరు రావటానికి ఓ కారణముంది. ఈ ఛాంబర్‌ను "చెవి" ఆకారంలోనే నిర్మించారు. అంటే..."తస్మాత్ జాగ్రత్త. నేను మొత్తం వింటున్నాను" అని సంకేతమిచ్చేలా ఇలా "చెవి" ఆకారంలోనే నిర్మించుకున్నాడు డియోనిసియస్. గుండుసూది పడిన శబ్దం కూడా ఈ ఛాంబర్‌లోని గోడల్లో ప్రతిధ్వనించేదట. అంతెందుకు. పైన ఎక్కడో కాగితం చింపిన శబ్దం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుందట. ఆ పరిసరాల్లో ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా డియోనిసియస్ తన ఛాంబర్‌లో కూర్చుని వింటూ ఉండేవాడు. ఇదిగో ఈ కారణంగానే..."గోడలకు చెవులుంటాయ్...జాగ్రత్త" అనే సామెత పుట్టుకొచ్చింది. 


భిన్న వాదనలు..


ఈ Dionysius Earపై భిన్న వాదనలున్నాయి. దీన్ని పూర్తిగా లైమ్‌స్టోన్‌తో తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం...ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహ అని. ఇందులో ఉన్న ప్రత్యేకతల కారణంగానే...అప్పట్లో డియోనిసియస్ దీన్ని తన సీక్రెట్ ఆపరేషన్ల కోసం వినియోగించుకున్నారని అంటున్నారు. ఇందులో ఏది నిజం అన్నది స్పష్టత లేదు. అయితే...అప్పట్లో డియోనిసియస్ ఈ ఛాంబర్‌ను జైలుగానూ వినియోగించాడట. ఈ గుహ పై భాగంలో కొంత వరకూ పగలగొట్టించాడట. పై నుంచి ఎవరు మాట్లాడినాఈ సందులో నుంచి గుహలో రీసౌండ్ అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడని కొందరు హిస్టారియన్స్ అంటారు. మరో విషయం ఏంటంటే...ఈ గుహలో ఖైదీల్ని ఉంచి వారిని హింసిస్తుండే వాళ్లు. అలా హింసకు గురైనప్పుడు వాళ్లు అరుస్తుంటే...ఆ అరుపుల్ని అక్కడే కూర్చుని డియోనిసియస్ ఎంజాయ్ చేసే వారన్న వాదన కూడా ఉంది. సరే ఈ వాదనలన్నీ పక్కన పెడితే..."గోడలకు చెవులుంటాయ్" అనే సామెత పుట్టడానికి ఇది ఓ కారణమని మాత్రం చెప్పొచ్చు. 


Also Read: క్లియోపాత్రా అందం రహస్యం ఇదే, ఇలా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే