Himachal Congress Meet:


పోటీలో ముగ్గురు..


హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ ఈ పార్టీ సొంతమైంది. అయితే...సీఎం పీఠంపై మాత్రం ఇంకా చిక్కుముడి వీడడం లేదు. ఈ పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడున్నారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్‌ వీరిలో ఒకరు. ఆమెతో పాటు హిమాచల్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖు, సీఎల్‌పీ లీడర్ ముకేశ్ అగ్నిహోత్రి రేస్‌లో ఉన్నారు. ANI వెల్లడించిన వివరాల ప్రకారం...Congress Legislature Party సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు షిమ్లాలో జరగనుంది. స్టేట్ హెడ్ క్వార్టర్స్‌కు ఇప్పటికే సీనియర్ నేతలంతా చేరుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, భూపేశ్ బాగేల్, భూపేంద్ర హుడా ఈ సమావేశానికి నేతృత్వం వహించననున్నారు. ఎమ్మెల్యేలంతా కలిసి 
అధిష్ఠానమే నిర్ణయం తీసుకునేందుకు అంగీకరించే ఓ తీర్మానం పాస్ చేయనున్నారు. అయితే...ఇప్పటి వరకూ అధిష్ఠానం "సీఎం అభ్యర్థి ఎవరు" అన్న విషయంలో స్పష్టతనివ్వలేదు. అందుకే..ఈ విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా త్వరగా తేల్చేయాలని చూస్తోంది. నిజానికి...నిన్న ఫలితాలు వెలువడక ముందు పార్టీ లీడ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలంతా చంఢీగర్ వెళ్లి అక్కడే సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కానీ...స్పష్టమైన మెజార్టీ రావడం వల్ల హిమాచల్‌ రాజధాని షిమ్లాలోనే మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరభద్ర సింగ్ సతీమణి ఈ పరిణామాలపై స్పందించారు. "పార్టీ గెలిచింది ఆయన (వీరభద్ర సింగ్) పేరు చెప్పుకునే. ఆయన కుటుంబ సభ్యుల్ని మర్చిపోవద్దు" అని అన్నారు. 






అధిష్ఠానం చేతుల్లోనే..


"సీఎం ఎవరు అన్న విషయంలో స్పష్టత రాలేదు. చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ ఆలోచించి అభ్యర్థిని ప్రకటిస్తాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే సీఎం ఎవరో నిర్ణయిస్తారు. ఓటర్లు తమ నిర్ణయమేంటో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కీలక బాధ్యత తీసుకుని సీఎం ఎవరో తేల్చుకోవాలి" అని వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉంటామని ఓ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే" అని కాంగ్రెస్ నేతలు బయటకు ధీమాగా చెబుతున్నా...లోలోపల మాత్రం కలవర పడుతున్నారు. ఇందుకు కారణంగా...బీజేపీ అప్పుడే "మంతనాలు" మొదలు పెట్టడం. రెబల్ అభ్యర్థులతో సహా...పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు  ఎర వేసి తమ వైపు లాక్కునేందుకు చూస్తోందన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే "ఆపరేషన్ లోటస్‌"తో గెలిచిన ఎమ్మెల్యేలకు ఎర వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో...
హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే విధంగా చేస్తుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా హిమాచల్‌లోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏం చేయొచ్చనే ఆలోచనలో పడ్డారు. హిమాచల్‌లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. 40 స్థానాల్లో విజయం సాధించింది. 


Also Read: Rajasthan Cylinder Blast: పెళ్లింట ఘోర విషాదం, సిలిండర్ పేలి నలుగురు మృతి - 60 మందికి తీవ్ర గాయాలు