ABP  WhatsApp

Heroin Seized In Kolkata: కోల్‌కతాలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్!

ABP Desam Updated at: 09 Sep 2022 07:11 PM (IST)
Edited By: Murali Krishna

Heroin Seized In Kolkata: కోల్‌కతాలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోల్‌కతాలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్!

NEXT PREV

Heroin Seized In Kolkata: బంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. దాదాపు రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ ఈ ఆపరేషన్‌లో లభ్యమైంది.


ఇదీ జరిగింది


గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. కోల్‌కతాలో రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ను ఈ టీం స్వాధీనం చేసుకుంది. కోల్‌కతా పోర్టుకు స్క్రాప్ కంటైనర్‌లో 40 కిలోల డ్రగ్స్‌ను తీసుకొచ్చారు. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.



ఓ చెత్త కంటైనర్‌లో భారీగా డ్రగ్స్ తీసుకు వెళ్తున్నట్లు మాకు సమాచారం అందింది. దీంతో గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడింది. నిందితులను అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.                                          - అధికారులు


 దిల్లీలో


మరొ భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను ఈ నెల 5న దిల్లీ పోలీసులు ఛేదించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్‌ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్ ఉంది. దీంతోపాటు 10 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తున్నట్లు గుర్తించారు.



పక్కా సమాచారంతో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు అఫ్గాన్‌ జాతీయులను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి 312.5 కేజీల మెథాంఫేటమిన్‌, 10 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువ దాదాపు రూ.1200 కోట్లు ఉంటుంది. నిందితుల ఇళ్ల వద్ద కూడా సోదాలు చేశాం, డ్రగ్స్‌ తయారీకి వినియోగించే కొన్ని నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాం.  - హరగోబిందర్ సింగ్ ధాలివాల్, దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కమిషనర్


అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్తాఫా స్టానిక్జా (23), రహీముల్లా రహీమ్‌ (44).. 2016 నుంచి భారత్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచే డ్రగ్స్‌ రాకెట్‌ను నడిపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విదేశాల్లో తయారుచేసిన ఈ మెథ్‌ను దిల్లీకి తీసుకువస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో దిల్లీలోని కాలిందికుంజ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో డ్రగ్స్ తరలిస్తోన్న ఆ ట్రక్‌ను స్వాధీనం చేసుకొని పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read: Ahmednagar Bogus Doctor: అయ్య బాబోయ్- 40 మందికి పశువుల ఇంజెక్షన్ ఇచ్చేసిన బెండు అప్పారావు!


Also Read: RBI on Loan Apps: లోన్‌ యాప్‌లపై కేంద్రం సీరియస్- RBIకు కీలక ఆదేశాలు!

Published at: 09 Sep 2022 06:46 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.